Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2021 Final: నేడే సెంట్‌ కిట్స్‌, సెయింట్ లూసియా ఫైనల్.. ప్లేయింగ్ ఎలెవన్, డ్రీమ్ 11 జట్లు ఇవే!!

CPL 2021 Final: SLK vs SNP Match Playing 11, Dream11 Prediction, Captain And Vice Captain Details

హైదరాబాద్: వెస్టిండీస్ గడ్డపై జరుగుతున్న కరీబియన్‌ ప్రీమియర్ లీగ్‌ (సీపీఎల్‌) 2021 చివరి దశకు చేరుకుంది. సెంట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియెట్స్‌, సెయింట్ లూసియా కింగ్స్ ఫైనల్ పొరులో తలపడనున్నాయి. బుధవారం బాసెటెరెలోని వార్నర్ పార్క్‌లో సీపీఎల్‌ 2021 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సెంట్‌ కిట్స్‌ వేదికగా బుధవారం రాత్రి 7 గంటలకు టాస్ పడనుండగా.. 7.30 మ్యాచ్ ఆరంభం కానుంది. భారత ఫాన్స్ డిస్నీ + హాట్‌స్టార్ ప్రీమియమ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియాలలో ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా లైవ్ చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో లైవ్ ప్రసారం కానుంది.

సెంట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియెట్స్‌, సెయింట్ లూసియా కింగ్స్ జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా సీపీఎల్‌ టైటిల్ గెలలేదు. ఈసారి ఏ జట్టు గెలిచినా.. తొలిసారి కప్ కైవసం చేసుకోనున్నాయి. 2017లో సెంట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పాట్రియెట్స్‌ జట్టు ఫైనల్లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. మరోవైపు సెయింట్ లూసియా కింగ్స్ ఫైనల్ చేరడం ఇదే మొదటిసారి. ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగతుంది. లీగ్ దశలో ఈ రెండు రెండుసార్లు తలపడగా.. సెయింట్ లూసియా విజయాలు అందుకుంది.

సెయింట్ లూసియా కింగ్స్ జట్లులో ఆండ్రీ ఫ్లెచర్, ఫాఫ్ డుప్లెసిస్, రహకీమ్ కార్న్‌వాల్, మార్క్ డీయల్, రోస్టన్ చేజ్, డేవిడ్ వీస్, టిమ్ డేవిడ్ వంటి హిట్టర్లు ఉన్నారు. కీమో పాల్, అల్జర్రి జోసెఫ్, వహబ్ రియాజ్ వంటి నాణ్యమైన పేసర్లు ఉన్నారు. సెంట్‌ కిట్స్‌ జట్టులో ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, డ్వేన్ బ్రావో, ఫాబియన్ అలెన్, డొమినిక్ డ్రేక్స్, షెల్డన్ కాట్రెల్ లాంటి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. లూయిస్, గేల్, రూథర్‌ఫోర్డ్ మాత్రమే రాణిస్తుండడం కాస్త ఆందోళన కలిగించే అంశం. బాసెటెరెలోని పిచ్ స్పిన్నర్లుగా అనుకూలంగా ఉండనుంది. మిడిల్ ఓవర్లలో పరుగులు రావడం కాస్త కష్టమే. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.

తుది జట్లు (అంచనా)

సెయింట్ లూసియా కింగ్స్: ఆండ్రీ ఫ్లెచర్ (కెప్టెన్), రహకీమ్ కార్న్‌వాల్, మార్క్ డీయల్, రోస్టన్ చేజ్, డేవిడ్ వీస్, టిమ్ డేవిడ్, కీమో పాల్, కదీమ్ అలీన్, జేవర్ రాయల్, అల్జర్రి జోసెఫ్, వహబ్ రియాజ్.
సెయింట్ కిట్స్ మరియు నెవిస్ పేట్రియాట్స్: ఎవిన్ లూయిస్, క్రిస్ గేల్, జాషువా డా సిల్వా, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, డ్వేన్ బ్రావో (కెప్టెన్), ఫాబియన్ అలెన్, డొమినిక్ డ్రేక్స్, షెల్డన్ కాట్రెల్, నసీమ్ షా, జోన్-రస్ జగ్గసర్, ఫవాద్ అహ్మద్.

డ్రీమ్ 11 టీమ్
ఆండ్రీ ఫ్లెచర్, ఎవిన్ లూయిస్ (వైస్ కెప్టెన్), మార్క్ డయల్, టిమ్ డేవిడ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రోస్టన్ చేజ్ (కెప్టెన్), డేవిడ్ వీస్, ఫాబియన్ అలెన్, షెల్డన్ కాట్రెల్, జేవర్ రాయల్, అల్జారీ జోసెఫ్.

Story first published: Wednesday, September 15, 2021, 16:03 [IST]
Other articles published on Sep 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+