Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2021: నాలుగు సెంచరీలు.. ఓకే ఓవర్‌లో 37 రన్స్.. ఈ సారైనా ఈ రికార్డులు బద్దలవుతాయా?

IPL 2021: 4 IPL records that may never be broken

హైదరాబాద్: క్రికెట్​లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదవుతూనే ఉంటాయి. సమయం రావాలి గానీ.. ఏ రికార్డైనా ఎప్పుడో ఒకప్పుడు బద్దలవ్వాల్సిందే. కానీ, 13 ఏళ్ల చరిత్ర కలిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్​)లో కొన్ని రికార్డులు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. ఎందుకంటే అవి అందనంత ఎత్తులో ఉన్నాయి. అత్యద్భుతాలు జరిగితే తప్పా ఇప్పట్లో ఈ రికార్డులు బ్రేక్ అయ్యే చాన్స్ లేదు. అలా ఐపీఎల్‌లో ఎప్పటికీ నూతనంగా ఉంటున్న ఓ నాలుగు రికార్డులపై లుక్కెద్దాం.

 అత్యధిక వ్యక్తిగత స్కోరు..

అత్యధిక వ్యక్తిగత స్కోరు..

టీ20 క్రికెట్‌ చరిత్రలో ఉన్న గొప్ప ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌గేల్‌ తొలి వరుసలో ఉంటాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతర్జాతీయ, ఇతర విదేశీ టీ20 లీగ్‌ల్లో అతను నెలకొల్పిన రికార్డులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇక.. గేల్ ఐపీఎల్‌లో మరెవ్వరికీ సాధ్యం కాని రీతిలో ఒక అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. అదే 2013లో పుణె వారియర్స్‌పై 175 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడం. ఇది ఐపీఎల్‌లోనే కాకుండా టీ20 క్రికెట్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు. కేవలం 66 బంతుల్లోనే 13 ఫోర్లు, 17 సిక్సర్లు బాది ఈ ఘనతను అందుకున్నాడు. 'యూనివర్స్‌ బాస్‌' గేల్‌ నెలకొల్పిన 175 పరుగుల రికార్డును బ్రేక్‌ చేయడం బహుశా ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు.

నాలుగు సెంచరీలు...

నాలుగు సెంచరీలు...

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటి వరకు మైదానంలో అతను సాధించిన ఘనతలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఇక.. టీ20 ఫార్మాట్‌లో ఒక్కసారి సెంచరీ చేయడమే కష్టమైన పని. అలాంటిది 2016 ఐపీఎల్‌లో భీకర ఫామ్‌లో ఉన్న టీమిండియా 'రన్‌ మెషిన్‌' ఏకంగా నాలుగు సెంచరీలు బాదేశాడు. ఆ సీజన్‌లో మొత్తం 16 మ్యాచులాడిన విరాట్‌ 81.08 సగటు, 152.03 స్ట్రెక్‌రేట్‌తో.. 973 పరుగులు సాధించాడు. ఇందులో 4 శతకాలు, 7 హాఫ్ సెంచరీలున్నాయి. ఒకే సీజన్‌లో నాలుగు సెంచరీలు బాదడం, అన్ని పరుగులు చేయడం మరెవరికీ సాధ్యం కాకపోవచ్చు.

ఓవర్‌లో 37 పరుగులు..

ఓవర్‌లో 37 పరుగులు..

సాధారణంగా ఒక ఓవర్‌లో అత్యధికంగా 36 పరుగులు చేయవచ్చు. యువరాజ్‌ సింగ్‌, కీరన్‌ పొలార్డ్‌, గిబ్స్‌తోపాటు మరికొంతమంది ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు కొట్టి 36 పరుగులు చేశారు. కానీ 2011లో రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు, కోచి టస్కర్స్‌ కేరళ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 37 పరుగులొచ్చాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కొచ్చి జట్టు కేవలం 125 పరుగులే చేసింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు అలవోకగా చేధించింది. బెంగళూరు ఇన్నింగ్స్‌లో ప్రశాంత్‌ పరమేశ్వరన్‌ వేసిన మూడో ఓవర్‌లో గేల్‌ వరుసగా 6,6,4,4,6,6,4 బాదాడు. కాగా.. ఇందులో రెండో బంతి నోబాల్‌. దీంతో ఒకే ఓవర్‌లో 37 పరుగులొచ్చాయి. ఈ మ్యాచ్‌లో క్రిస్‌గేల్‌ కేవలం 16 బంతుల్లోనే 44 పరుగులు చేశాడు. బహుషా ఈ రికార్డు ఇప్పట్లో బ్రేక్ అవ్వడం కష్టమే.

 అరంగేట్ర మ్యాచ్‌లో 6 వికెట్లు..

అరంగేట్ర మ్యాచ్‌లో 6 వికెట్లు..

2019లో ముంబై తరఫున ఐపీఎల్‌ అరంగేట్రం చేసిన వెస్టిండీస్ ఫాస్ట్‌బౌలర్ అల్జారీ జోసెఫ్ తన ఫస్ట్ మ్యాచ్‌లోనే అరుదైన ఘనతను అందుకున్నాడు. సన్‌రైజర్స్‌తో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో అతను.. నాలుగు ఓవర్లు వేసి కేవలం 12 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నెలకొల్పాడు. అరంగేట్ర ఆటగాడిగానూ ఇదే ఉత్తమ బౌలింగ్‌ ప్రదర్శన. ఈ రికార్డు బ్రేక్‌ కావాలంటే ఎవరైనా బౌలర్‌ ఒకే మ్యాచ్‌లో 7 వికెట్లు పడగొట్టాలి లేదా 12 కంటే తక్కువ పరుగులకే 6 వికెట్లు తీయాలి. బహుశా ఈ రికార్డు బ్రేక్‌ కాకపోవచ్చు. అంతకు ముందు ఈ రికార్డు పాకిస్థాన్‌ ఫాస్ట్‌బౌలర్‌ సొహైల్‌‌ తన్వీర్‌ (6/14) పేరిట ఉండేది.

Story first published: Friday, April 2, 2021, 16:07 [IST]
Other articles published on Apr 2, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+