Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2020, Qualifier 1, DC vs MI: టాస్ కీలకం కానుందా? నెగ్గిన జట్టుదే విజయమా? గత 10 మ్యాచ్‌ల్లో..

IPL 2020: will toss play a crucial role in DC vs MI qualifier match

దుబాయ్‌: ఐపీఎల్‌-2020 లీగ్‌ దశను దాటి ప్లే ఆఫ్స్‌కు చేరింది. నేడు జరిగే తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ ఎదుర్కొంటుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకు ఆదివారం రెండో క్వాలిఫయర్‌లో ఆడే మరో అవకాశం ఉంటుంది.

ముంబై జట్టు ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఐదుసార్లు ఫైనల్‌ చేరి నాలుగు సార్లు టైటిల్ ముద్దాడగా... తొలి సీజన్‌ నుంచి ఢిల్లీ అత్యుత్తమ ప్రదర్శన సెమీఫైనల్‌కే పరిమితమైంది. తాజా ఫామ్, బలాబలాలపరంగా చూస్తే ముంబైదే పైచేయిగా కనిపిస్తున్నా... లీగ్‌ ఆరంభంలో అద్భుతంగా ఆడిన ఢిల్లీని కూడా తక్కువగా అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో హోరాహోరీ సమరం ఖాయం.

టాస్ కీలకం..

టాస్ కీలకం..

అయితే ఈ మ్యాచ్‌లో టాస్ కీలకం కానుందా? నెగ్గిన వారికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో పిచ్‌లన్నీ నెమ్మదించాయని, చేజింగ్ జట్లకే అనుకూల ఫలితాలు వచ్చాయని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. పైగా గత 10 మ్యాచ్‌ల్లో 8 సార్లు చేజింగ్ టీమ్స్ విజయం సాధించాయి. టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడం..పిచ్ నుంచి లభిస్తున్న సహకారాన్ని అందిపుచ్చుకొని ప్రత్యర్థిని తక్కు స్కోర్‌కు కట్టడి చేయడం.. ఆ తర్వాత ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని అధిగమించడం.. గత కొన్ని మ్యాచ్‌ల్లో కనబడ్డ సీన్. డ్యూ ప్రభావం కూడా చేజింగ్ టీమ్స్‌కు కలిసొచ్చింది.

భారీ స్కోర్ చేస్తేనే...

భారీ స్కోర్ చేస్తేనే...

ఇక పోతే టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిన రెండు జట్లు కూడా భారీ స్కోర్ చేయడంతో విజయాన్నందుకున్నాయి. రాజస్థాన్‌పై కోల్‌కతా 191 పరుగులు చేసి గెలవగా.. ఢిల్లీపై హైదరాబాద్ 219 రన్స్ చేసి విజయాన్నందుకుంది. కాబట్టి ఎలిమినేటర్ మ్యాచ్‌లో కూడా టాస్ కీలకం కానుంది. టాస్ గెలిచే జట్టు ఏ మాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ తీసుకుంటుంది. నెమ్మదిగా మారిన పిచ్‌లపై తొలుత ఫీల్డింగ్ చేసే జట్లకు అడ్వాంటేజ్ ఉంటుంది. స్వింగ్‌కు అనుకూలిస్తుంది. ఈ మ్యాచ్‌లో గనుక ఢిల్లీ టాస్ గెలిస్తే.. రబడా, నోర్జ్ రఫ్ఫాడిస్తారు. పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబైని నిలవరించాలంటే ఢిల్లీకి ఉన్న ఒక్క మార్గం ఇదే.

టాస్ దెబ్బ ముంబై రుచి చూసింది..

టాస్ దెబ్బ ముంబై రుచి చూసింది..

పటిష్ట ముంబై ఇండియన్స్‌కు కూడా టాస్ దెబ్బ గట్టిగానే తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ముంబై టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. ఇక టాస్ ఓడిన రోహిత్.. ఇది పెద్ద సమస్య కాదని, గుడ్ క్రికెట్ ఎవరూ ఆడితే వారు గెలుస్తారని టాస్ సమయంలో అన్నాడు. తీరా బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి హైదరాబాద్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఆఖర్లో కీరన్ పొలార్డ్ భారీ ఇన్నింగ్స్ పుణ్యమా ఆ జట్టు 149 పరుగులు చేసింది గానీ లేకుంటే ఏ 130 రన్స్‌కో పరిమితమయ్యేది.

అనంతరం హైదరాబాద్ ఆడుతూ పాడుతూ 17.1 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 150 పరుగుల లక్ష్యాన్ని చేధించి సునాయసంగా గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో బుమ్రా, బౌల్ట్ లేకపోవడం ఆరెంజ్ ఆర్మీకి కలిసొచ్చినా.. మ్యాచ్ ఆడినా ధావల్ కులకర్ణి, ప్యాటిన్సన్‌లు కూడా మంచి బౌలర్లే. ఈ ఓటమితో టాస్ విలువ తెలుసొచ్చిన రోహిత్.. మ్యాచ్ అనంతరం టాస్ కూడా తమ ఓటమిలో ఒక కారణమైందని అంగీకరించాడు.

Happy Birthday Virat Kohli: బాల్ బాయ్ నుంచి టీమిండియా సారథిగా.. శతకవీరా సరిలేరు నీకెవ్వరూ!

Story first published: Thursday, November 5, 2020, 13:49 [IST]
Other articles published on Nov 5, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+