Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టీవ్ స్మిత్ కెప్టెన్సీపై వేటు.. రాజస్థాన్ రాయల్స్ కొత్త సారథిగా ఇంగ్లండ్ ప్లేయర్..?

IPL 2020: Will Jos Buttler Replace Steve Smith as Rajasthan Royals Captain

హైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ తప్పుకున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెట్టేందుకు అతను ఈ నిర్ణయం తీసుకున్నాడని కేకేఆర్ మేనేజ్‌మెంట్ ప్రకటించింది. నూతన సారథిగా ఇంగ్లండ్ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌‌‌‌ను నియమించింది. అయితే డీకేనే తానంతట తాను తప్పుకున్నాడని పైకి చెబుతున్నా.. తప్పించారనే విషయం స్పష్టమవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

అయితే కేకేఆర్ బాటలోనే రాజస్థాన్ రాయల్స్ కూడా తమ టీమ్ కెప్టెన్‌ను మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జట్టు సారథ్య బాధ్యతల నుంచి స్టీవ్ స్మిత్‌ను తప్పించి ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కు అప్పగించాలని రాజస్థాన్ టీమ్‌మేనేజ్‌‌మెంట్ భావిస్తోందనే ప్రచారం ఊపందుకుంది.

ఇక ఆ జట్టు ట్విటర్ వేదికగా చేసిన కొన్ని ట్వీట్స్ కూడా ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. జోస్ బట్లర్ ప్రాక్టీస్ సెషన్ వీడియోను షేర్ చేయడంతో పాటు.. వరల్డ్ బెస్ట్ బాస్ అని రాసి ఉన్నకాఫీకప్‌ను పట్టుకున్న బట్లర్ ఫొటోను అభిమానులతో పంచుకుంది. 'జోస్ వంటి బాస్‌‌కు థ్యాంక్స్'అని క్యాప్షన్‌గా పేర్కొంది. దాంతో రాజస్థాన్ తదుపరి కెప్టెన్ జోస్ బట్లరే అనే సంకేతాలను ఇచ్చిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

'రాజస్థాన్ తదుపరి కెప్టెన్ జోస్ బట్లర్ అనేది ఈ ట్వీట్ అంతరార్థం అన్నమాట'అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ఇక 8 మ్యాచ్‌ల్లో మూడు మాత్రమే గెలిచిన రాజస్థాన్ పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో ఉంది. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో గెలుపు ముంగిట ఆ జట్టు బోల్తా పడింది. బ్యాటింగ్ వైఫల్యం ఆ జట్టు కొంప ముంచుతుంది.

తొలి రెండు మ్యాచ్‌లు మినహా మరే ఏ మ్యాచ్‌లో ఆ జట్టు టాపార్డర్ సక్సెస్ కాలేదు. ముఖ్యంగా స్టీవ్ స్మిత్ పేలవ ఫామ్ ఆ జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోంది. ఈ క్రమంలోనే కెప్టెన్‌ను మార్చే యోచనలో రాజస్థాన్ మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.

Story first published: Friday, October 16, 2020, 21:33 [IST]
Other articles published on Oct 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+