కోల్‌కతా అసలు భయం అదేనా?.. అందుకే సునీల్ నరైన్‌ను ఆడించలేదా?!!

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా సోమవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఏకంగా 82 పరుగుల తేడాతో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ ఆడలేదు. ఇదే ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. నరైన్ మ్యాచ్ ఆడకపోవడంతో.. అతడు రూల్స్‌కి విరుద్ధంగా త్రో విసురుతున్నట్లు కోల్‌కతా పరోక్షంగా ఒప్పుకున్నట్లయింది.

ఫీల్డ్ అంపైర్ల ఫిర్యాదు
గత శనివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరైన్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. తన కోటా 4 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అంతేకాదు చివరి ఓవర్‌లో గ్లెన్ మాక్స్ వెల్ లాంటి భీకర హిట్టర్ ఉన్నాకూడా.. అద్భుతంగా బౌలింగ్ చేసి కోల్‌కతాకి విజయాన్ని అందించాడు. అయితే ఆ మ్యాచ్‌లో నరైన్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకి విరుద్ధంగా ఉందని ఫీల్డ్ అంపైర్లు ఫిర్యాదు చేశారు. దాంతో బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో అతడ్ని కోల్‌కతా పక్కనపెట్టింది.

కోల్‌కతా ఒప్పుకుందా?
నిజానికి ఫీల్డ్ అంపైర్ల ఫిర్యాదుకు సునీల్ నరైన్ బౌలింగ్‌పై ఎలాంటి నిషేధం పడలేదు. దాంతో బెంగళూరుతో మ్యాచ్‌లో అతడ్ని కోల్‌కతా ఆడిస్తుందని అందరూ ఊహించారు. కానీ నరైన్‌ని పక్కనపెట్టి.. యువ ఆటగాడు టామ్ బాంటన్‌ని తుది జట్టులోకి తీసుకున్నాడు కోల్‌కతా సారథి దినేష్ కార్తీక్. దాంతో నరైన్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకి లోబడి లేదని పరోక్షంగా కోల్‌కతా ఒప్పుకున్నట్లయింది. ఇక నరైన్ స్థానంలో ఆడిన బాంటన్ 12 బంతులు ఎదుర్కొని 8 పరుగులు మాత్రమే చేశాడు. సరైన ఆరంభం లేక ఈ మ్యాచ్ కోల్‌కతా ఓడిపోయింది.

కోల్‌కతా అసలు భయం అదే
ఫీల్డ్ అంపైర్లు రెండోసారి సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు చేస్తే.. అతనిపై నిషేధం పడుతుంది. దీంతో ఐపీఎల్ 2020లో ఆడే అవకాశాన్ని నరైన్ కోల్పోతాడు. ఇది కోల్‌కతా అసలు భయం. ఒకవేళ ఇదే జరిగితే కోల్‌కతాకు భారీ నష్టం వాటిల్లనుంది. ఎందుకంటే.. ప్లే ఆఫ్ చేరాలంటే కోల్‌కతాకు వచ్చే మ్యాచులు చాలా కీలకం. ఆ మ్యాచులలో నరైన్‌ను కెప్టెన్ దినేష్ కార్తీక్ ఆడించనున్నాడు. అందుకే అతడిని గత మ్యాచులో ఆడించలేదని సమాచారం. కోల్‌కతా ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచులలో 4 విజయాలు అందుకుని 8 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. కోల్‌కతా తన తర్వాత మ్యాచ్‌ని అబుదాబి వేదికగా శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.

2015లోనే ఫిర్యాదు
సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదులు రావడం ఇదే మొదటిసారి కాదు. 2015లో త్రో విసురుతున్నాడని అతని బౌలింగ్‌పై ఐసీసీ నిషేధం విధించింది. అయితే ఏడాది వ్యవధిలో తన బౌలింగ్ యాక్షన్‌ని సరిదిద్దుకున్న నరైన్.. మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. ఆపై అంతా సాఫీగా సాగింది. ఇప్పుడు మళ్లీ అతడి బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు అందింది. ఈసారి కూడా బౌలింగ్ యాక్షన్‌ను మార్చుకుంటాడో లేదో చూడాలి.
RCB vs KKR: కోల్‌కతాతో మ్యాచ్.. కోహ్లీని ట్రోల్ చేసిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications