
రవిశాస్త్రికి తెలియకుండా ఉండే అవకాశం లేదు:
గాయపడి విశ్రాంతి తీసుకున్న రోహిత్ శర్మ మంగళవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచులో బరిలోకి దిగడంతో వీరేంద్ర సెహ్వాగ్ బీసీసీఐ బోర్డుపై మండిపడ్డారు. 'రోహిత్ శర్మ పరిస్థితి ఏంటో కోచ్ రవిశాస్త్రికి తెలియకుండా ఉండే అవకాశం లేదు. సెలక్షన్ కమిటీలో రవిశాస్త్రి భాగం కానప్పటికీ.. ఎంపికకు రెండు మూడు రోజుల ముందైనా అతని అభిప్రాయమేంటో సెలక్టర్లైనా మాట్లాడి ఉంటారు. ఆయన నుంచి కొన్ని సూచనలు స్వీకరిస్తారు. ఆటగాళ్ల విషయంలో కచ్చితంగా మాట్లాడతారు. అలానే గాయాలపై కూడా చర్చిస్తారు' అని సెహ్వాగ్ అన్నారు.

ఈ ఏడాది వింతగా ఉంది:
'నిజానికి రోహిత్ శర్మ గాయపడి ఉంటే అతడి స్థానంలో మరెవరినైనా ప్రత్యామ్నాయంగా ప్రకటించాలి. కానీ బీసీసీఐ అలా చేయలేదు. అంతేకాదు అతడికీ జట్టులో చోటివ్వలేదు. ఇదే నాకు అర్థం కావడం లేదు. ఈ ఏడాది వింతగా ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారు?.. రోహిత్ హైదరాబాద్‌పై మ్యాచ్ ఆడాడు. ముంబై ప్లేఆఫ్స్ వెళ్లింది. అక్కడ కూడా అతడు ఆడతాడు. దృఢంగా ఉన్నానని రోహిత్ అంటున్నాడు. అలాంటప్పుడు ఎందుకు ఎంపిక చేయడం లేదు' అని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశ్నించారు.

బీసీసీఐ వ్యవహార శైలి విస్మయం కలిగిస్తోంది:
'ఐపీఎల్ 2020లో ఫ్రాంచైజీకి ఆడేందుకు సిద్ధంగా ఉన్న ఆటగాడిని జాతీయ జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదన్నదే నన్ను ఆశ్చర్యపరుస్తోంది. నిజంగా బీసీసీఐ వ్యవహార శైలి విస్మయం కలిగిస్తోంది. రోహిత్ శర్మ ఐపీఎల్ ఆడుతుంటే.. జాతీయ జట్టులోకీ తీసుకోవచ్చు కదా' అని సెహ్వాగ్ అన్నారు. గత రాత్రి టాస్ సమయంలో రోహ్హిట్ మాట్లాడుతూ...'అంతా బాగుంది. నేను ఫిట్‌గా, చురుగ్గా కూడా ఉన్నాను' అని స్వయంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా పర్యటనకు జట్టును ప్రకటించిన అక్టోబర్ 26 నుంచి రోహిత్ విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా రోహిత్ గాయం విషయంపై బోర్డు ఒక స్పష్టమైన వివరణ ఇవ్వకపోవడం దీనిని మరింతగా పెంచింది.

గంగూలీ సలహా ఇచ్చిన రోజే:
రోహిత్ శర్మ ఐపీఎల్ కోసం తొందరపడొద్దని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సూచించాడు. ఈ ఒక్క లీగ్ కోసం భవిష్యత్తును పాడుచేసుకోవద్దని సూచించాడు. రోహిత్ లాంటి పరిణతి చెందిన ఆటగాడికి ఇవన్నీ ఒకరు చెప్పాల్సిన అవసరం కూడా లేదన్నాడు. గంగూలీ సలహా ఇచ్చిన రోజే రోహిత్ మైదానంలోకి దిగి ఒక రకంగా బోర్డును ఎగతాళి చేశాడు. గాయంతో ముంబై ఆడిన గత నాలుగు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రోహిత్ మంగళవారం ఏమాత్రం ప్రాధాన్యత లేని మ్యాచ్‌లో ఆడాడు.


Click it and Unblock the Notifications

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ క్రికెటర్!!