Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్‌ క్రికెటర్‌!!

West Indies star Marlon Samuels announces retirement

జమైకా: వెస్టిండీస్‌ సీనియర్‌ క్రికెటర్‌ మార్లోన్‌ శామ్యూల్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. ఈ ఏడాది జూన్‌లో తన వీడ్కోలు గురించి వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డుకు సమాచారం ఇచ్చాడు. రిటైర్మెంట్‌ ఇస్తున్నట్లు బుధవారం ప్రకటించాడు. 2000వ సంవత్సరంలో ఐసీసీ చాంపియన్స్‌ట్రోపీలో భాగంగా శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా శామ్యూల్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. 2018 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌తో చివరి మ్యాచ్‌ ఆడాడు. దాదాపు 18 సంవత్సరాలు విండీస్‌ మిడిలార్డర్‌ బ్యాటింగ్‌లో కీలకంగా నిలిచాడు.

 ఫైనల్‌ పోరులో అత్యధిక స్కోరు

ఫైనల్‌ పోరులో అత్యధిక స్కోరు

2012, 2016 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లు విండీస్‌ గెలవడంలో మార్లోన్‌ శామ్యూల్స్‌ కీలకపాత్ర పోషించాడు. రెండుసార్లు ఫైనల్‌ పోరులో అత్యధిక స్కోరు సాధించాడు. కొలంబో వేదికగా జరిగిన 2012 ప్రపంచకప్‌ టీ20 ఫైనల్లో మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శనతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ మ్యాచ్‌లో 56 బంతుల్లో 78 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ అద్భుత గణాంకాలు(1/15) నమోదు చేయడంతో విండీస్‌ సునాయాస విజయాన్ని అందుకుంది.

 రెండో వికెట్‌కు 372 పరుగులు

రెండో వికెట్‌కు 372 పరుగులు

కోల్‌కతాలో జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లోనూ మార్లోన్‌ శామ్యూల్స్‌ సత్తాచాటాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన తుది పోరులో 66 బంతుల్లో 85 పరుగులు చేయడంతో ఇంగ్లీష్‌ జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. రెండు ఐసీసీ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్'‌గా ఎంపికైన ఏకైక ఆటగాడు శామ్యూల్సే కావడం విశేషం. 2015 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్‌తో కలిసి శామ్యూల్స్‌ రెండో వికెట్‌కు 372 పరుగులు జోడించడం ఇప్పటికీ ఒక రికార్డుగా ఉంది.

71 టెస్టులు, 207 వన్డేలు

71 టెస్టులు, 207 వన్డేలు

అంతర్జాతీయ క్రికెట్‌లో కరీబియన్‌ జట్టు తరఫున మార్లోన్‌ శామ్యూల్స్‌ 71 టెస్టులు, 207 వన్డేలు, 67 టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 11,134 పరుగులు చేయగా.. 17 శతకాలు పూర్తి చేసుకున్నాడు. దీంతో పాటు అన్ని ఫార్మాట్లు కలిపి తన ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌తోనూ 152 వికెట్లు తీశాడు. టెస్టుల్లో అత్యధికంగా 260 రన్స్ చేశాడు. వన్డేల్లో 133, టీ20ల్లో 89 రన్స్ చేశాడు. ఇక 15 ఐపీఎల్ మ్యాచులలో 161 పరుగులు బాదాడు.

వివాదాలతోనే పాపులర్:

వివాదాలతోనే పాపులర్:

తన కెరీర్‌లో ఆటకంటే వివాదాలతోనే మార్లోన్‌ శామ్యూల్స్‌ ఎక్కువగా పేరు పొందాడు. ఇటీవలే ఇంగ్లండ్‌ క్రికెటర్‌ బెన్‌ స్టోక్స్‌ భార్యపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్‌ వార్న్‌ ఆగ్రహానికి గురయ్యాడు. అంతకముందు కూడా 2012లో బిగ్‌బాష్‌ లీగ్‌ సందర్భంగా షేన్ వార్న్‌, మార్లోన్‌ శామ్యూల్స్‌ మధ్య పెద్ద గొడవే చోటుచేసుకుంది.

లేటుగా వచ్చినా దుమ్ములేపాడుగా..5 మ్యాచ్‌లలో 10 వికెట్లు..బ్యాట్‌తోనూ మెరిశాడు..ప్లేఆఫ్‌లోకి SRH!!

Story first published: Wednesday, November 4, 2020, 16:41 [IST]
Other articles published on Nov 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+