Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబై ఇండియన్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చిత్తవుతుంది: వీరేంద్ర సెహ్వాగ్

Virender Sehwag says Sunrisers Hyderabad should give Mumbai Indians a walkover
IPL 2020 : Virender Sehwag Trolls SRH Says SRH should give MI a Walkover || Oneindia Telugu

న్యూఢిల్లీ: వరుస విజయాలతో దూకుడు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో చిత్తవుతుందని టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. ఆ జట్టుకు ధాటిగా ఆడే సత్తాలేదని, భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్ ముందు తేలిపోతుందని అవహేళన చేశాడు. చిన్న మైదానమైన షార్జాలో మ్యాచ్ జరుగుతుండటం సన్‌రైజర్స్ ప్రతీకూలాంశమన్నాడు. ముంబై నిర్ధేశించిన భారీ లక్ష్యాన్ని చేధించలేక సన్‌రైజర్స్ చేతులెత్తేస్తుందని ఎగతాళి చేశాడు.

క్రిక్‌బజ్ రిపోర్టర్ గౌరవ్ కపూర్‌తో మాట్లాడిన సెహ్వాగ్.. ముంబైని ఓడించే సీన్ సన్‌రైజర్స్‌కు లేదన్నాడు. 'ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ తేలిపోతుంది. ముంబైని ఢీకొట్టలేక చేతులెత్తేస్తుంది. ఎందుకంటే ఆ జట్టులో 200-250 పరుగులు చేయగల పవర్ హిట్టర్లు లేరు. సన్‌రైజర్స్ బ్యాటింగ్ సామర్థ్యం 150 పరుగులకే సరిపోతుంది. అదే ముంబై తొలుత బ్యాటింగ్ చేస్తే 200కు పైగా రన్స్ చేస్తుంది. ఇరు జట్లు సమతూకంగా లేకపోవడంతో మ్యాచ్ వన్‌సైడ్ కానుంది'అని సెహ్వాగ్ కామెంట్ చేశాడు.

ఇక సెహ్వాగ్ వ్యాఖ్యలపై హైదరాబాద్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ అయిన తర్వాత మాట్లాడుతామని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ముంబై ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ భువనేశ్వర్ కుమార్ సేవలను కోల్పోయింది. గాయం కారణంగా భువీ దూరమవడంతో అతని స్థానంలో సిద్దార్థ్ కౌల్‌ను జట్టులోకి తీసుకుంది.

Story first published: Sunday, October 4, 2020, 15:53 [IST]
Other articles published on Oct 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+