
రాంగ్ ప్లేయర్స్‌కు మద్దతు ఇచ్చాడు:
తాజాగా రే జెన్నింగ్స్ క్రికెట్.కామ్‌తో మాట్లాడుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కప్ గెలవకపోవడానికి గల కారణాలను వివరించాడు. 'ఐపీఎల్‌లో 25-30 మంది ఆటగాళ్లు జట్టులో ఉంటారు. ఆటగాళ్లందరినీ చూసుకోవడం కోచ్ పని. ఒక్కోసారి విరాట్ కోహ్లీ ఆలోచనలు వేరుగా ఉండేవి. కొన్నిసార్లు అతను సార్లు రాంగ్ ప్లేయర్స్‌కు మద్దతు ఇచ్చాడు. కానీ ఆ విషయంలో అతన్ని నిందించలేం. కొంతమంది ఆటగాళ్లు కొన్ని పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ లేదా బ్యాటింగ్ చేయాలని నేను కోరుకున్నా. కానీ ఆ సమయంలో కోహ్లీకి భిన్నమైన ఆలోచనలు ఉండేవి' అని జెన్నింగ్స్ తెలిపాడు.

ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ చాలా భిన్నం:
'ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్ చాలా భిన్నం. ఆరు వారాల వ్యవధిలో కొంతమంది ఆటగాళ్లు ఫామ్ అందుకుంటారు. మరికొందరు ఫామ్ కోల్పోవచ్చు. ధాటిగా ఆడే క్రమంలో త్వరగానే పెవిలియన్ చేరొచ్చు. అందుకే జట్టులో నిలకడైన ఆటగాడు కావాలి. నేను కోచ్‌గా ఉన్నప్పుడు కొంతమంది ఆటగాళ్లు బాగా ఆడారు. కానీ విరాట్ కోహ్లీకి మాత్రం భిన్నమైన అభిప్రాయాలు ఉండేవి. ఏదేమైనా ఇది గతం. కోహ్లీ రోజు రోజుకు రాటుదేలడం ఆనందంగా ఉంది. ఇప్పుడు ఐపీఎల్ ట్రోఫీలను గెలవడం ప్రారంభిస్తాడు' అని రే జెన్నింగ్స్ అన్నాడు. జెన్నింగ్స్ 2009 నుంచి 2014 వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కోచ్‌గా ఉన్నాడు.

ఖచ్చితంగా విజయాలు సాధిస్తాడు:
'ఐపీఎల్ పొట్టి ఫార్మాట్ ఆట అని మనం మర్చిపోకూడదు. విరాట్ కోహ్లీ ఆర్‌సీబీ జట్టును సెమీ-ఫైనల్స్ (ప్లేఆఫ్స్), ఫైనల్స్ వరకు తీసుకెళ్లాడు. రాబోయే సంవత్సరాల్లో అతను ఖచ్చితంగా విజయాలు సాధిస్తాడు. కొన్నిసార్లు కోహ్లీ ఆటగాళ్లతో సమయాన్ని గడపట్లేదని విమర్శలు ఉన్నాయి. సారథి అన్నాక ఎన్నో విషయాలు చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి అలా జరగడం సహజమే. అది నేను అర్థం చేసుకోగలను. అన్ని సర్దుకుంటాయి. జట్టు పనితీరులో వేలం చాలా ముఖ్యమైన అంశం. మంచి ఆటగాళ్లను అక్కడే ఎంచుకోవాల్సి ఉంటుంది' అని రే జెన్నింగ్స్ పేర్కొన్నాడు. కోహ్లీకి మంచి క్రికెట్ పరిజ్ఞానం ఉందని, అతను ఉన్నత ప్రమాణాలను నిర్దేషించుకుంటాడన్నాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా ఎదగడం ఆనందంగా ఉందన్నాడు.

టోర్నీలోనే టాప్ స్కోరర్:
విరాట్ కోహ్లీ ఐపీఎల్ టోర్నీలోనే టాప్ స్కోరర్. 5,412 పరుగులు చేశాడు. 2019 సీజన్‌లో 14 మ్యాచ్‌లాడి.. 464 పరుగులు చేశాడు. కానీ బెంగళూరు టీమ్ కనీసం ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది. అంతేకాదు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. 2016 సీజన్‌లో 16 మ్యాచ్‌లాడిన కోహ్లీ.. 973 పరుగులు చేశాడు. ఆ తర్వాత మూడు సీజన్లలోనూ కోహ్లీ 308, 530, 464 పరుగులు చేశాడు. కోహ్లీ పరుగులు చేస్తున్నా.. సారథ్యంలో మాత్రం తేలిపోతున్నాడు. ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.

వేలంలో ఆచితూచి:
ఈసారి జరిగిన వేలంలో ఆర్‌సీబీ జట్టులోకి కీలక బ్యాట్స్‌మన్‌లు, బౌలర్లు వచ్చారు. వేలంలో ఆర్‌సీబీ యాజమాన్యం ఆచితూచి అడుగేసింది. ఆరోన్ ఫించ్, జోష్ ఫిలిప్పి, క్రిస్ మోరిస్‌లతో బ్యాటింగ్ విభాగంను.. డేల్ స్టెయిన్, ఆడమ్ జంపాలను తీసుకుని బౌలింగ్ విభాగాలను పటిష్టం చేసింది. ఇక ఆరంభ మ్యాచ్‌ల్లో సాధ్యమైనన్ని ఎక్కువ విజయాలు సాధిస్తేనే బెంగళూరు కథ మారుతుంది. ఈసారి కచ్చితంగా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంది.
'రైనా లేకపోవడం చెన్నైకి ఎదురుదెబ్బే.. ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌ను భర్తీ చేసుకోవడం కష్టమే'


Click it and Unblock the Notifications
