RCB: డివిలియర్స్‌ను 'బిస్కెట్' అని కోహ్లీ ఎందుకు పిలుస్తాడంటే?

దుబాయ్: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2020లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్లేఆఫ్స్ దిశగా అడుగులేస్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అద్భుతంగా ఆడుతోంది. స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఏటా విఫలమవుతుండటంతో.. ఈసారి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆటగాళ్లందరూ తీవ్రంగా కష్టపడుతున్నారు. ఓ పక్కన మ్యాచ్‌లు గెలుస్తూనే, మరోపక్క జట్టులోని అన్ని విభాగాలను పటిష్ఠం చేసుకుంటున్నారు. ఒకప్పటి ఓటముల భారం లేకుండా స్వేచ్ఛగా ఆడేందుకే యూఏఈకి వచ్చామని బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ, మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ ఆరంభం నుంచి చెబుతూనే ఉన్నారు.

వ్యాపారంపై దృష్టి సారించాడు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మొదటి ఆడుతున్న విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే. ఇద్దరూ పరస్పరం ఎంతో అభిమానాన్ని కలిగిఉంటారు. ఈ ఇద్దరూ ఓ షోలో మాట్లాడారు. విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... 'ఆటలో అద్భుతాలు సృష్టించిన ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాక వ్యాపారంపై దృష్టి సారించాడు. స్థిరాస్తి వ్యాపారానికి సంబంధించిన మెలకువలను నేర్చుకుంటున్నాడు. అందులో నైపుణ్యాన్ని కూడా సంపాదించాడు' అని చెప్పాడు.

ఇష్టమైన వారిని బిస్కట్ అంటారు
'2011లో జొహనెస్‌బర్గ్‌లో తొలిసారి ఏబీతో పరిచయమైంది. బెంగళూరు తరఫున కలిసి ఆడుతున్నందుకు ఎంతో ఉత్సాహంగా ఉంది. అదే తనకీ చెప్పాను' అని విరాట్ అన్నాడు. దక్షిణాఫ్రికాలో ఇష్టమైన వారిని బిస్కట్ అని పిలుస్తారని, తానెంతో అభిమానించే ఏబీని తనూ బిస్కట్ అనే పిలుస్తానని కోహ్లీ పేర్కొన్నాడు. బెంగళూరు జట్టు క్యాప్షన్ 'ప్లే బోల్డ్' అన్న సంగతి తెలిసిందే. దీని గురించి వివరిస్తారా అని అడగ్గా.. ధైర్యమని ఏబీ తెలిపాడు. భయపడకుండా దూకుడుగా ఆడడమని పేర్కొన్నాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడటం అని విరాట్ చెప్పుకొచ్చాడు.

ఢిల్లీని ఓడిస్తే
సీజన్ తొలి సగంలో అదరగొట్టిన బెంగళూరు తర్వాత చతికిల పడింది. ఒక్క మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్స్‌లో చేరుతాయని భావిస్తుండగా.. మూడు మ్యాచ్‌ల్లో వరుసగా ఓటమిపాలయింది. ఈరోజు మ్యాచ్‌లో ఢిల్లీని బెంగళూరు ఓడిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌లో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఒకవేళ ఓడితే ఈ సీజన్ నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడుతుంది. లేదా రన్‌రేట్ పరంగా అర్హత సాధించే అవకాశం కూడా ఉంటుంది. అది కూడా కోల్‌కతా కన్నా మెరుగైన రన్‌రేట్‌తోనే ఢిల్లీ చేతిలో ఓటమిపాలవ్వాలి. బెంగళూరు 21 పరుగుల కంటే ఎక్కువ తేడాతో ఓడిపోకూడదు. ఒకవేళ ముందే బ్యాటింగ్ చేసినా ఛేదనలో దిల్లీని 14 బంతుల కంటే ముందు లక్ష్యాన్ని చేరుకోనివ్వకూడదు. ముంబై చేతిలో హైదరాబాద్ ఓడిపోతే కూడా కోహ్లీసేనకు అవకాశం ఉంటుంది.
ఆస్ట్రేలియా పర్యటన.. రోహిత్‌ను ఎందుకు పక్కబెట్టారో చెప్పిన రవిశాస్త్రి!!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications