
విజయ్ శంకర్ ఔట్:
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా గాయపడిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఐపీఎల్ 2020 నుంచి వైదొలిగాడు. హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ కారణంగా విజయ్ ఐపీఎల్ నుంచి వైదొలిగినట్లు ఓ జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ రోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచులో సన్‌రైజర్స్ కచ్చితంగా గెలవాలి. ఇలాంటి కీలక సమయంలో జట్టుకు విజయ్ దూరమవడం ఎస్‌ఆర్‌హెచ్‌కు భారీ ఎదురుదెబ్బే.

తొడ కండరం పట్టేయడంతో:
మంగళవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ విజయ్ శంకర్ గాయపడ్డాడు. 10వ ఓవర్ బౌలింగ్ చేసిన విజయ్ 7 పరుగులు ఇచ్చాడు. 12వ మూడో బంతికి ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను ఔట్ చేశాడు. ఐదో బంతి అనంతరం అతడు గాయపడ్డాడు. ఎడమ కాలి తొడ కండరం పట్టేయడంతో మరో బంతి వేయకుండానే శంకర్ మైదానాన్ని వీడాడు. దీంతో వార్నర్ చివరి బంతిని పూర్తి చేశాడు. ఈ సీజన్లో 7 మ్యాచ్‌లు ఆడిన విజయ్ శంకర్ 97 పరుగులు చేశాడు.

సాహా ఓకే:
ఢిల్లీతోనే జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలో దిగిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా బ్యాటింగ్ చేస్తూ గాయపడ్డాడు. ఆపై మైదానంలోకి రాలేదు. దీంతో ఆ మ్యాచ్‌లో సాహా బదులు శ్రీవాత్స్ గోస్వామి వికెట్ కీపింగ్ చేశాడు. కానీ సాహా కోలుకున్నాడని, బెంగళూరుతో ఈరోజు రాత్రి జరిగే మ్యాచ్‌లో బరిలో దిగుతాడని సమాచారం తెలుస్తోంది. ఇక విజయ్ శంకర్ తనంలో ప్రియం గార్గ్, అబ్దుల్ సమద్‌లలో ఒకరు ఆడనున్నారు.

బదులు తీర్చుకోవాలని:
12 మ్యాచ్‌లాడి 10 పాయింట్లతో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో బెంగళూరు, ముంబైలతో తలపడనుంది. ప్లేఆఫ్ రేసులో ఉన్న మిగతా జట్లతో పోలిస్తే మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న సన్‌రైజర్స్.. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిస్తే నేరుగా ముందంజ వేసే అవకాశాలున్నాయి. ఒక్క మ్యాచ్ ఓడినా ప్లేఆఫ్‌కు దూరమవుతుంది. సన్‌రైజర్స్ శనివారం రాత్రి బెంగళూరుతో తలపడనుంది. ఈ సీజన్లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్.. ఈ మ్యాచ్‌లో గెలిచి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది. ఇరు జట్లు ఇప్పటి వరకూ 14సార్లు పోటీ పడగా.. చెరో ఏడుసార్లు విజయం సాధించాయి.
KXIP vs RR: 99 వద్ద ఔటైన గేల్.. ఆర్చర్ జోస్యం మళ్లీ నిజమైంది.. ఫ్యాన్స్ షాక్!!


Click it and Unblock the Notifications












