వికెట్లు విరగ్గొడుతున్న బోల్ట్:
శనివారమే తొలి మ్యాచ్ ఉండడంతో ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ట్రైనింగ్ సెషన్స్‌లో గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తున్నారు. హెడ్ కోచ్ మహేల జయవర్ధనే పర్యవేక్షణలో ఆ జట్టు ఆటగాళ్లు శిక్షణ పొందుతున్నారు. జయవర్థనే పర్యవేక్షణలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న న్యూజీలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ తనలోని మొత్తం శక్తిసామర్థ్యాలను వెలికి తీస్తున్నాడు. నెట్స్‌లో ఫుల్ స్టీమ్‌తో బంతులు విసురుతూ చెమటోడ్చుతున్నాడు. ఈ క్రమంలో విసిరిన ఓ బంతికి మిడిల్ స్టంప్ రెండు ముక్కలయ్యింది.

క్లీన్ బౌల్ట్!!.. ట్రెంట్ వచ్చేశాడు:
ట్రెంట్ బౌల్ట్ విరగొట్టిన స్టంప్‌కు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియోకి 'క్లీన్ బౌల్ట్!!.. ట్రెంట్ వచ్చేశాడు' అంటూ ముంబై ఇండియన్స్ క్యాప్షన్ పెట్టింది. ముంబై జట్టు షేర్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 'బ్యాట్స్‌మన్‌లు జాగ్రత్త' అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలం పాటలో ట్రెంట్ బౌల్ట్‌ను ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. అంతకుముందు బౌల్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో తనను ప్రూవ్ చేసుకున్నాడు. బౌల్ట్ కివీస్ జట్టులో ప్రధాన పేసర్ అన్న విషయం తెలిసిందే.

బౌల్ట్‌పై భారీ ఆశలు:
జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ వంటి దిగ్గజ ఫాస్ట్ బౌలర్లతో ముంబై ఇండియన్స్ జట్టు పటిష్టంగా ఉంది. అయితే వ్యక్తిగత కారణాలతో మలింగ ఈ ఏడాది టోర్నీకి దూరం కావడంతో ముంబై జట్టు.. ట్రెంట్ బౌల్ట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. బౌల్ట్ యూఏఈ పిప్‌లపై చెలరేగే అవకాశం ఉంది. పేస్, స్వింగే బోల్ట్ బలం. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా నాలుగు సార్లు టైటిల్ గెలుచుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డుల్లో ఉంది. ఐదోసారి ఛాంపియన్స్‌గా నిలిచి తమకు తిరుగులేదని చాటిచెప్పాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు చూస్తోంది.

95 మీటర్ల భారీ సిక్సర్:
నాలుగు రోజుల క్రితం టీమిండియా స్టార్ ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ భారీ సిక్సర్ బాదాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న రోహిత్.. స్పిన్నర్ వేసిన బంతిని బారీ సిక్స్‌గా మలిచాడు. 95 మీటర్ల ఎత్తులో వెళ్లిన ఆ బంతి.. స్టేడియం బయట రోడ్డు మీద వెళ్తున్న బస్సు రూఫ్‌టాప్‌పై పడింది. దీంతో బౌలింగ్ వేసిన స్పిన్నర్ ఒక్కసారిగా ఆచ్చర్యపోయాడు. దాదాపు ఆరు నెలల తర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్ చేపట్టిన రోహిత్.. బారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అంతేకాదు తనలోని ఫీల్డింగ్ నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించాడు.
US Open 2020లో డొమినిక్ థీమ్ చరిత్ర.. తొలి ఆస్ట్రియా క్రీడాకారుడిగా రికార్డు!!


Click it and Unblock the Notifications












