న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇక క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. వరుసగా దంచికొట్టే ధనాధన్ లీగ్‌లు!

IPL 2020 to start on September 19, final on November 8
IPL 2020 Set To Start On September 19, Final On November 8 || Oneindia Telugu

న్యూఢిల్లీ: కరోనా కారణంగా క్రికెట్ మ్యాచ్‌లు మిస్సయిన అభిమానులకు ఇక నుంచి పండుగే. ఇన్నాళ్లు ఆటల్లేక తెగ బోరుగా ఫీలైన వారందరికీ వరుస టీ20 లీగ్స్‌తో కావాల్సిన మజా లభించనుంది. ఆగస్టు 8న కరేబీయన్ లీగ్ ప్రారంభం కానుండగా.. ఇంగ్లండ్ టీ20 బ్లాస్ట్ ఆగస్టు 27న తెరలేవనుంది. ఇక క్రికెట్‌ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-13వ సీజన్‌ ఓ వారం ముందే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ వరకు ఈ క్యాష్ రిచ్ లీగ్ సందడి చేయనుండగా.. డిసెంబర్‌లో ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్‌బాష్ లీగ్ అలరించనుంది. ఇలా వరుస టోర్నీలతో క్రికెట్ ఫ్యాన్స్ రాబోయే ఐదు నెలలు పండుగ చేసుకోనున్నారు.

వాస్తవానికి సెప్టెంబరు 26 నుంచి ఐపీఎల్‌ జరుగుతుందని అంతా భావించారు. కానీ ఈ షెడ్యూల్‌ అటు ఆసీస్‌ పర్యటనకు ఇబ్బంది కలిగిస్తుండడంతో వారం రోజుల ముందుకు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో సెప్టెంబరు 19 నుంచి యూఏఈలో ఐపీఎల్‌కు తెర లేవనుందని, నవంబరు 8న ఫైనల్‌ జరుగుతుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వచ్చే వారం జరిగే ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌లో పూర్తి వివరాలు చర్చించడంతో పాటు తుది షెడ్యూల్‌పై ఆమోద ముద్ర వేయనున్నారు. అయితే ఇప్పటికే ఈ విషయమై ఆయా ఫ్రాంచైజీలకు సమాచారమిచ్చారు.

'ఐపీఎల్‌ సెప్టెంబరు 19 నుంచి 51 రోజుల పాటు జరిగి నవంబరు 8న ముగుస్తుంది. ఈ కుదించిన షెడ్యూల్‌.. జట్లతో పాటు బ్రాడ్‌కాస్టర్లు, వాటాదారులకు కూడా అనుకూలంగా ఉండనుంది. యూఏఈలో జరిగే ఈ టోర్నీ కోసం ఆటగాళ్లంతా క్వారంటైన్‌.. తగిన శిక్షణ కోసం ఆగస్టు 20నే అక్కడికి వెళతారు. ఏడు వారాలపాటు జరగబోయే ఐపీఎల్‌లో ఇంతకుముందు అనుకున్నట్టుగానే ఐదు డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌లుండబోతున్నాయి' అని ఓ బోర్డు అధికారి తెలిపాడు.

సచిన్ టెండూల్కర్‌ను మోసం చేసిన హైదరాబాద్ రియల్టర్!సచిన్ టెండూల్కర్‌ను మోసం చేసిన హైదరాబాద్ రియల్టర్!

Story first published: Friday, July 24, 2020, 14:25 [IST]
Other articles published on Jul 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X