ఐపీఎల్ టైమింగ్‌లో మార్పుల్లేవ్.. రాత్రి 8కే ఐపీఎల్ మ్యాచ్‌లు

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌ల టైమింగ్ మారలేదు. ఎప్పటిలాగే రాత్రి 8 గంటలకే మ్యాచ్‌లు ప్రారంభమవుతాయని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఇక తొలిసారి కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను ప్రవేశపెడుతున్నామని, నోబాల్ నిర్ణయాలను మూడో అంపైర్ తీసుకుంటారని స్పష్టం చేశాడు. ఇక ఈ సీజన్ మార్చి 29 నుంచి ప్రారంభమవుతుందని, ఫైనల్ మ్యాచ్ కూడా ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా మే 24న జరుగుతుందన్నాడు. సోమవారం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం అనంతరం దాదా మీడియాతో మాట్లాడాడు.

ఫ్రాంచైజీలకే ఓటు..
బ్రాడ్ కాస్టర్ కోరిక మేరకు ఐపీఎల్ టైమింగ్‌లో మార్పు ఉంటుందని,రాత్రి 7 గంటలకు మారుస్తారని ప్రచారం జరిగింది. కానీ దీన్ని వ్యతిరేకించిన ఫ్రాంచైజీల నిర్ణయానికే బీసీసీఐ ఓటు వేసింది. ‘ఐపీఎల్ రాత్రి మ్యాచ్‌ల టైమింగ్‌లో ఎలాంటి మార్పు లేదు. గతంలోలానే రాత్రి 8 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. కాకపోతే ఈసారి రెండు మ్యాచ్‌లు జరిగే రోజులని తగ్గించాం. కేవలం ఐదు రోజులు మాత్రమే రెండు మ్యాచ్‌లను షెడ్యూల్ చేశాం. ఈ సీజన్ నుంచి కాంకుషన్ సబ్‌స్టిట్యూట్ తీసుకొస్తున్నాం. నోబాల్‌ను కూడా మూడో అంపైర్ నిర్ణయిస్తారు'అని గంగూలీ తెలిపాడు.

ఆల్ స్టార్స్ మ్యాచ్..
ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఆల్ స్టార్స్ మ్యాచ్ ఒకటి నిర్వహిస్తున్నామని, వేదిక ఖరారు చేయలేదని దాదా చెప్పుకొచ్చాడు. ‘లీగ్‌కు ముందు ఐపీఎల్ ఆల్ స్టార్స్ మ్యాచ్ నిర్వహిస్తాం. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని మొతేరాస్టేడియం అయితే కాదు. ఎందుకంటే ఇంకా అది సిద్ధం కాలేదు. వేదికను ఇంకా ఖారారు చేయలేదు.'అని గంగూలీ చెప్పుకొచ్చాడు.

ఫైనల్ ముంబైలోనే..
గుజరాత్‌లో నిర్మితమవుతున్న మోతెరా స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్‌ను నిర్వహిస్తామని ఊహాగానాలు వినిపించినా ఈ సీజన్ టైటిల్ ఫైట్ డిఫెండింగ్ చాంపియన్ హోం గ్రౌండ్ వాంఖడేలోనే జరుగుతుందని గంగూలీ స్పష్టం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications