నిన్ను చూడగానే.. నా కష్టాలన్నీ మరిచిపోతా: రైనా

దుబాయ్: యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్ సెప్టెంబర్ 19న ప్రారంభం కానుంది. ఐపీఎల్ ప్రారంభం కావడానికి 20 రోజుల సమయమే ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు యూఏఈ చేరుకొని.. క్వారంటైన్ ముగించుకుంటున్నాయి. ఇక ఐపీఎల్ టోర్నీ తేదీలు ఖరారు అయినా.. మ్యాచ్ షెడ్యూల్ మాత్రం ఇంకా విడుదల కాలేదు. ఈవారంలో అధికారిక షెడ్యూల్ రానుంది. గత శుక్రవారం ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) దుబాయ్ గడ్డపై అడుగుపెట్టింది. ఈ రోజుతో క్వారంటైన్ గడువు ముగిసింది. ఇక ప్రాక్టీస్ చేయడమే మిగిలుంది.
నిన్ను చూస్తే గర్వంగా ఉందిరా:
ప్రస్తుతం యూఏఈలో ఉన్న సురేష్ రైనా కుటుంబ ప్రేమను మిస్ అవుతున్నాడు. సీఎస్‌కే ప్రాంచైజీ ఆ జట్టు ఆటగాళ్లకు కుటుంబాన్ని వెంటతీసుకెళ్లే అవకాశం ఇవ్వలేదు. దీంతో రైనా భార్య ప్రియాంక, కూతురు గ్రేసియా, కుమారుడు రియో యూపీలోనే ఉండిపోయారు. తాజాగా ప్రియాంక.. రియోకు సంబందించిన ఓ వీడియో తీసి రైనాకు పంపించారు. ఆ వీడియో చూసిన రైనా.. భావోద్వేగం చెందాడు. ఆ వీడియోను అభిమానులతో పంచుకుంటూ... 'నిన్ను చూస్తే గర్వంగా ఉందిరా. నువ్వు నా జీవితంలోకి రావడం నన్ను గర్వపడేలా చేసింది. నిన్ను చూడగానే నా కష్టాలన్నీ మరిచిపోతా' అని కాప్షన్ రాసుకొచ్చాడు.

నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు చూస్తూ:
కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ కోసం వెళ్లిన ఆటగాళ్లందరు ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా నిబంధనలు ఉన్నాయి. దుబాయ్ రూల్స్ ప్రకారం సురేష్ రైనా గురువారం వరకు క్వారంటైన్‌లో ఉన్నాడు. క్వారంటైన్‌లో తన జీవితం ఎలా గడుస్తోందో తెలియజేస్తూ ర్యాప్ పాడి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. 'క్వారంటైన్ సమయంలో ఇదే చేయాల్సి వస్తోంది. వీడియో రికార్డు చేసి, అందరినీ అలరించడమే. మీరేమనుకుంటున్నారో చెప్పండి' అంటూ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు ఆ వీడియోకి కాప్షన్ రాసుకొచ్చాడు. క్వారంటైన్ సమయంలో జిమ్ చేస్తూ, రోజంతా నెట్‌ఫ్లిక్స్‌లో గడుపుతున్నట్లు ఆ వీడియోలో రైనా చెప్పాడు.

మూడు ఫార్మాట్‌లలోనూ సెంచరీలు:
ఆగస్టు 15న ఎంఎస్ ధోనీతో పాటు సురేష్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ వీరిద్దరిని అభినందిస్తూ.. స్వయంగా లేఖ విడుదల చేయడం విశేషం. దశాబ్దకాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన రైనా.. 18 టెస్ట్‌లు, 226 వన్డేలు, 78 టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. టెస్ట్‌ల్లో 768, వన్డేల్లో 5615, టీ20ల్లో 1605 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఏడు సెంచరీలు, 48 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఆఫ్ బ్రేక్ బౌలర్ అయిన రైనా.. టెస్ట్‌ల్లో 13, వన్డేల్లో 36, టీ20ల్లో 13 వికెట్లు తీశాడు. ఇక మూడు ఫార్మాట్‌లలోనూ సెంచరీలు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా రైనా పేరుపై రికార్డు ఉంది. చురుకైన ఫీల్డర్‌గా గుర్తింపు పొందిన రైనా.. తన కెరీర్ మొత్తంలో 167 క్యాచ్‌లు అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
నువ్ నాలో భాగం లిటిల్ హీరో: సానియా