నువ్ నాలో భాగం లిటిల్ హీరో: సానియా

హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి తల్లుల జీవితాలను కష్టతరం చేసింది. ఎందుకంటే.. ఈ కఠిన సమయంలో చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో కష్టం. అయితే ప్రతి తల్లి తన పిల్లలను ఇంట్లో వినోదభరితంగా మార్చడానికి ప్రయత్నిస్తుంది. దీనికి భారత స్టార్ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అతీతం కాదు. ఈ కరోనా సమయంలో తన కొడుకు ఇజాన్ మీర్జా మాలిక్‌తో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఆమె అటు టెన్నిస్ ప్రాక్టీస్‌ను, ఇటు కొడుకు ఆలనా పాలనను సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
కరోనా సమయంలో సానియా మీర్జా ఓ వైపు టెన్నిస్ ప్రాక్టీస్ చేస్తూనే.. మరోవైపు ఇజాన్ మీర్జా మాలిక్‌తో అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నారు. కొడుకును గ్రౌండ్‌కు తీసుకెళ్లి స్వేచ్ఛగా తిప్పుతున్నారు. మైదానంలో ఇజాన్ చేసే చిలిపి పనులు చూసి మురిసిపోతున్నారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. సానియా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. 'వాడే నా జీవితం.. నాలో భాగం నా లిటిల్ హీరో' అని కాప్షన్ పెట్టారు.
తల్లి అయిన తర్వాత తన జీవితమే మారిపోతుందని సానియా మీర్జా చెబుతున్నారు. ఒక తల్లిగా నా కుమారుడిని ఆలనా, పాలన చూసూకోవడం తన బాధ్యత అంటున్నారు. 'ఇది నాకు తెలిసిన అత్యంత నిస్వార్థమైన ప్రేమ, నేను పొందుతున్న అద్భుతమైన అనుభూతి' అంటూ సానియా తన కుమారుడి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అక్టోబర్ 30, 2018న సానియా.. ఇజాన్ మీర్జా మాలిక్‌కు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
View this post on InstagramYou are part of me ,my little one ❤️ 🤱🏽#ourwalksandconversations 💞 @izhaan.mirzamalik
A post shared by Sania Mirza (@mirzasaniar) on
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో పెళ్లి, కుమారుడు ఇజాన్ పుట్టిన తర్వాత సానియా మీర్జా తన ఫిట్ నెస్ విషయంలో దృష్టి సారించారు. ఈ క్రమంలో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చేంతగా నాజుకుగా తయారయ్యారు. గర్భం దాల్చడంతో 23 కిలోల బరువు పెరిగిన సానియా.. ఆ తర్వాత కేవలం 4 నెలల్లోనే 26 కిలోలు తగ్గి ఆశ్చర్యపరిచారు. తిరిగి టెన్నిస్ బాట పట్టిన ఆమె.. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌కు సన్నద్ధమవుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications