న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs KKR: ఈ ఒత్తిడి నా చిన్నప్పటి నుంచి ఉన్నదే.. త్రోబ్యాక్ పిక్‌తో షారుఖ్ తనయ!

IPL 2020: Suhana Khan posts a throwback picture after KKR’s Super Over win over SRH

అబుదాబి: ఐపీఎల్ 2020 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒక అడుగు ముందుకు మరో అడుగు వెనకకు అన్నట్లు సాగుతుంది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన థ్రిల్లింగ్ మ్యాచ్‌లో కేకేఆర్ సూపర్ ఓవర్‌లో గెలుపొందింది. బ్యాటింగ్ వైఫల్యం మరోసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ కొంపముంచగా.. లూకీ ఫెర్గుసన్ అద్భుత బౌలింగ్ కోల్‌కతాకు సూపర్ విక్టరీని అందించింది. ముందు 15 పరుగులకు 3 వికెట్లు... ఆ తర్వాత సూపర్‌ ఓవర్‌లో 3 బంతుల్లో 2 పరుగులుచ్చి 2 వికెట్లు తీసిన ఈ న్యూజిలాండ్‌ పేసర్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు చుక్కలు చూపించాడు.

సన్‌రైజర్స్ గెలవాలంటే ఆఖరి బంతికి రెండు పరుగులు కావాలి. కానీ వార్నర్ సింగిలే తీయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. ఛేజింగ్‌లో చావు దెబ్బ కొట్టిన ఫెర్గూసన్ మూడు బంతుల్లో రెండు పరుగులిచ్చి ఇద్దర్ని ఔట్ చేయడంతో కేకేఆర్ మూడు పరుగుల చిన్న టార్గెట్‌తో బ్యాటింగ్‌కు వచ్చింది. రషీద్ ఖాన్ వేసిన ఆ ఓవర్‌లో సింపుల్‌గా లక్ష్యం పూర్తి చేసిన కోల్‌కతా ప్లే ఆఫ్ రేసులో ముందుడుగు వేసింది. మరోపక్క ఓవరాల్‌గా ఆరో మ్యాచ్‌లో ఓడిన ఆరెంజ్ ఆర్మీ నాకౌట్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది.

అయితే ఈ మ్యాచ్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ కో ఓనర్,బాలీవుడ్ బాద్ షా షారుఖ్ తనయ సుహానా ఖాన్ స్పందించింది. ప్రస్తుతం డాడీతో కలిసి దుబాయ్‌లో ఐపీఎల్‌ను ఆస్వాదిస్తున్న సుహానా.. ఈ ఒత్తిడి చిన్నప్పటి నుంచి ఉన్నదేనని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. దీనికి ఓ త్రో బ్యాక్ పిక్ కూడా జతచేసింది. ఆ పిక్‌లో చిన్నపిల్లగా ఉన్న సుహానాను షారుఖ్ ఎత్తుకొని స్టాండ్స్‌లో చిందేస్తూ కేకేఆర్‌కు మద్దతు తెలుపుతున్నాడు. ఐపీఎల్ ప్రారంభ సీజన్ నాటి ఫోటో ఇది. అప్పుడు సుహానా వయస్సు ఏడేళ్లు మాత్రమే. 'నా చిన్నప్పటి నుంచి ఐపీఎల్‌లో ఈ ఒత్తిడి చూస్తున్నా'అని ఈ మ్యాచ్ ఎంతా? అనే అర్థంలో సహానా పోస్ట్ ఉంది.

View this post on Instagram

the stresss🤭!! since '08 💜@kkriders

A post shared by Suhana Khan (@suhanakhan2) on

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ (37 బంతుల్లో 36; 5 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌. కెప్టెన్‌ మోర్గాన్‌ (23 బంతుల్లో 34; 3 ఫోర్లు, 1 సిక్స్‌), దినేశ్‌ కార్తీక్‌ (14 బంతుల్లో 29; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుతో జట్టు మంచి స్కోరు అందుకుంది. అనంతరం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 163 పరుగులు చేయడంతో మ్యాచ్‌ 'టై' అయ్యింది. కెప్టెన్‌ వార్నర్‌ (33 బంతుల్లో 47 నాటౌట్‌; 5 ఫోర్లు), బెయిర్‌స్టో (28 బంతుల్లో 36; 7 ఫోర్లు), విలియమ్సన్‌ (19 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నారు.

MI vs KXIP: రోహిత్ శర్మ అసభ్య పదజాలం.. మ్యానెర్స్ లేదంటు మండిపడుతున్న ఫ్యాన్స్ (వీడియో)MI vs KXIP: రోహిత్ శర్మ అసభ్య పదజాలం.. మ్యానెర్స్ లేదంటు మండిపడుతున్న ఫ్యాన్స్ (వీడియో)

Story first published: Monday, October 19, 2020, 15:04 [IST]
Other articles published on Oct 19, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X