Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RR: డేవిడ్ వార్నర్ X జోఫ్రా ఆర్చర్.. బెన్ స్టోక్స్ ఆడేనా? గెలిచేదెవరు?

IPL 2020, SRH vs RR: Who will win Sunrisers Hyderabad vs Rajasthan Royals

దుబాయ్: ఐపీఎల్ 2020లో మరో డబుల్ హెడర్‌కు రంగం సిద్దమైంది. ఆదివారం సాయంత్రం జరిగే తొలి మ్యాచ్‌లో విజయ ఉత్సాహంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. వరుసగా నాలుగు విజయాలతో సతమతమవుతున్న రాజస్థాన్ రాయల్స్‌తో తలపడుతుంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో సంచలన విజయాలతో అదరగొట్టిన రాజస్థాన్.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి ఢిలా పడింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైన గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలవాలని భావిస్తోంది. మరోవైపు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతూ విజయ ఉత్సాహంలో ఉన్న హైదరాబాద్ తమ జైత్రయాత్రను కొనసాగించాలని పట్టుదలతో ఉంది.

బలబలాల పరంగా పేపర్‌పై ఇరు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ రాజస్థాన్ నిలకడలేమి బ్యాటింగ్ కారణంగా హైదరాబాద్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. అయితే ఈ మ్యాచ్‌ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ ఆడటంపై క్లారిటీ లేకున్నా.. అతను తుది జట్టులోకి వస్తే రాజస్థాన్ బలం రెట్టింపు అవుతుంది. మరీ ఈ మ్యాచ్‌లో గెలుపు ఏ జట్టును వరిస్తుందో..? చూడాలి!

వార్నర్ vs ఆర్చర్..

వార్నర్ vs ఆర్చర్..

గత మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షో అద్భుత విజయాన్నందుకున్న హైదరాబాద్ అదే ఆటను పునరావృతం చేస్తే రాజస్థాన్‌కు కష్టాలు తప్పవు. ముఖ్యంగా హైదరాబాద్ ఓపెనర్లు బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వారే ఆ జట్టు బ్యాటింగ్ బలం. కానీ జోఫ్రా ఆర్చర్.. గత 5 ఇన్నింగ్స్‌ల్లో డేవిడ్ వార్నర్‌కు బౌలింగ్ చేయగా.. నాలుగుసార్లు సన్‌రైజర్స్ కెప్టెన్‌ను ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆర్చర్ బౌలింగ్‌ను వార్నర్ ఎలా ఎదుర్కొంటాడనేది కీలకం కానుంది. ఇప్పుడిదే హైదరాబాద్ అభిమానులను కలవరపెడుతుంది.

ఇక హైదరాబాద్‌ను వేధిస్తున్న ప్రధాన సమస్య మిడిలార్డర్. గత మ్యాచ్‌లో కూడా టాపార్డర్ చెలరేగినా మిడిలార్డర్ రాణించలేకపోయింది. ఆరంభ మ్యాచ్‌ల్లో అదరగొట్టిన మనీష్ పాండే తర్వాతి మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. అతనితో పాటు విలియమ్సన్, ప్రియమ్ గార్గ్ రాణించాల్సి ఉంది. ఇక సన్‌రైజర్స్ బౌలింగ్ ఎప్పుడూ బలంగానే ఉంటుంది. కానీ భువనేశ్వర్ గాయంతో తప్పుకోవడంతో సందీప్ శర్మ, నటరాజన్ బాధ్యత తీసుకున్నారు. వారికి తోడుగా రషీద్ ఖాన్ సంచలన ప్రదర్శన కనబరుస్తుండటంతో హైదరాబాద్ ఫలితాలను అందుకుంటుంది. వీరంతా మరోసారి తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాల్సిన అవసరం ఉంది. ఎలాంటి మార్పుల్లేకుండానే హైదరాబాద్ బరిలోకి దిగే అవకాశం ఉంది.

స్టోక్స్ కోసమే ఎదురు చూపులు..

స్టోక్స్ కోసమే ఎదురు చూపులు..

డొమెస్టిక్ కుర్రాళ్లతో తొలి రెండు మ్యాచ్‌ల్లో సంచలన విజయాలను నమోదు చేసిన రాజస్థాన్ తరువాతి నాలుగు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలను చవిచూసింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో తేలిపోయింది. మార్పులు చేసి బరిలోకి దిగినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు వారికి ఉన్న ఒకే ఒక ఆశ బెన్ స్టోక్స్. అతను ఈ మ్యాచ్‌‌లో ఆడటంపై క్లారిటీ లేనప్పటికీ వస్తే మాత్రం బలం పెరుగుతుంది. శనివారమే క్వారంటైన్ పూర్తి చేసుకున్న స్టోక్స్‌ను అప్పుడే ఆడించే సాహసం రాజస్థాన్ చేయకపోవచ్చు. ఒక వేళ జట్టులోకి వస్తే మాత్రం ఆండ్రూ టై బెంచ్‌‌కే పరిమితమవుతాడు.

తొలి రెండు మ్యాచ్‌‌ల్లో రాణించిన శాంసన్, స్మిత్ తర్వాతి నాలుగింటిలో విఫలమయ్యారు. వారు చెలరేగాల్సిన అవసరం ఉంది. ఆల్‌‌రౌండర్ రాహుల్ తెవాటియా కూడా తన మార్క్ పెర్ఫామెన్స్ చూపించాల్సి ఉంది. బౌలింగ్‌లో జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండగా.. గత మ్యాచ్‌ల్లో ఇతర బౌలర్లు టచ్‌లోకి వచ్చారు. వరుణ్ ఆరోన్, కార్తీక్ త్యాగి రాణిస్తున్నారు. జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

తుది జట్లు(అంచనా):

తుది జట్లు(అంచనా):

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో, మనీష్ పాండే, విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమాద్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, టీ నటరాజన్, ఖలీల్ అహ్మద్

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్(కీపర్), స్టీవ్ స్మిత్(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్, బెన్ స్టోక్స్/ఆండ్రూ టై, మహిపాల్ లోమ్‌‌‌రోర్, రాహుల్ తెవాటియా, శ్రేయాస్ గోపాల్, కార్తీక్ త్యాగీ, జోఫ్రా ఆర్చర్, వరుణ్ ఆరోన్/జయదేవ్ ఉనాద్కత్

పిచ్ రిపోర్ట్

పిచ్ రిపోర్ట్

పిచ్ బ్యాటింగ్, బౌలింగ్‌కు ఫేవర్‌గా ఉంటుంది. క్రీజులో ఓపికగా ఆడితే పరుగులు తీయవచ్చు. ఇక్కడ రెండు మ్యాచ్‌లు టై అయి సూపర్ ఓవర్‌కు కూడా దారితీసాయి. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 11 మ్యాచ్‌ల్లో 10 సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్లే గెలిచాయి. కింగ్స్ పంజాబ్‌తో జరిగిన ఒక్క మ్యాచ్‌లోనే చెన్నై 10 వికెట్లతో విజయాన్నందుకుంది. ఈ మైదానంలో మూడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ రెండింటిలో గెలిచి ఒకదానిలో ఓడింది. అది కూడా చేజింగ్‌లోనే ఓడింది. ఏకైక మ్యాచ్ ఆడిన రాజస్థాన్ కేకేఆర్ చేతిలో లక్ష్యాన్ని చేధించలేక చేతులెత్తేసింది. కాబట్టి టాస్ గెలిచే జట్టు బ్యాటింగ్ తీసుకుంటుంది. సాయంత్రం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌, డిస్నీ హాట్‌స్టార్‌‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

ముఖా ముఖి

ముఖా ముఖి

ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 11 సార్లు తలపడగా.. 6-5తో హైదరాబాద్ లీడ్‌లో ఉంది. చివరిసారిగా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ నాలుగు గెలిచింది. గత సీజన్లో చెరొక మ్యాచ్ గెలిచాయి. 2014లో యూఏఈలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించింది.

Story first published: Sunday, October 11, 2020, 13:06 [IST]
Other articles published on Oct 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+