న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs RR: తెవాటియా, పరాగ్‌ మెరుపులు.. ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌పై రాజస్థాన్‌ విజయం!!

IPL 2020, SRH vs RR: Riyan Parag, Rahul Tewatia help RR stun SRH

దుబాయ్: ఐపీఎల్ 2020లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ అద్భుత విజయం సాధించింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 5 వికెట్లు కోల్పోయి మరో బంతి ఉండగానే ఛేదించింది. ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌లో రాహుల్‌ తెవాటియా (45; 28 బంతుల్లో 4x4, 2x6), రియాన్‌ పరాగ్ ‌(42; 26 బంతుల్లో 2x4, 2x6)లు ఒత్తిడిని జయించి చివరివరకు నిలబడి రాజస్థాన్‌ జట్టుకు మూడో విజయాన్ని అందించారు. సన్‌రైజర్స్ బౌలర్లు ఖలీల్ అహ్మద్, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

‌MI vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. పంత్ ఔట్.. రహానే ఇన్!!‌MI vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. పంత్ ఔట్.. రహానే ఇన్!!

టాపార్డర్‌ ఢమాల్:

టాపార్డర్‌ ఢమాల్:

సన్‌రైజర్స్‌ నిర్దేశించిన 159 టార్గెట్‌లో బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌లు ఓపెనర్లుగా వచ్చారు. స్టోక్స్ ‌(5) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఖలీల్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఆ తర్వాత స్టీవ్‌ స్మిత్ ((5) రనౌట్‌ అయ్యాడు. అనవసరపు పరుగు కోసం యత్నించి పెవిలియన్‌ చేరాడు. స్మిత్‌ ఔటవడంతో రాజస్థాన్‌పై ఒత్తిడి పెరిగింది. ఖలీల్‌ తన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (16) ‌ను వెనక్కి పంపాడు. బట్లర్‌ వికెట్‌ కీపర్‌ జానీ బెయిర్‌స్టోకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో సన్‌రైజర్స్‌ మ్యాచ్‌పై పట్టు సాధించింది.

తెవాటియా-పరాగ్‌ మెరుపులు:

తెవాటియా-పరాగ్‌ మెరుపులు:

ఈ దశలో సంజూ శాంసన్‌, రాబిన్‌ ఉతప్పలు క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించారు. శాంసన్ ‌(26), ఊతప్ప (18)లు రెండంకెల స్కోరు చేశారు కానీ.. విజయానికి అవసరమైన ఇన్నింగ్స్‌ మాత్రం ఆడలేకపోయారు. రాజస్థాన్‌ ఆశలు వదుకున్న స్థితిలో యువ ఆటగాళ్లు

తెవాటియా-పరాగ్‌లు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మధ్య ఓవర్ల వరకు మ్యాచ్‌పై పట్టుసాధించిన సన్‌రైజర్స్‌.. ఆఖర్లో కుర్రాళ్ల బ్యాటింగ్‌ మెరుపులకు చేతులెత్తేసింది. ఇద్దరు 85 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇది రాజస్తాన్‌ కు మూడో విజయం. వరుసగా నాలుగు ఓటముల తర్వాత తొలి విజయం కావడంతో ఆ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది.

 బెయిర్‌స్టో విఫలం:

బెయిర్‌స్టో విఫలం:

అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న హైదరాబాద్‌ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. మనీష్‌ పాండే (54; 44 బంతుల్లో 2x4, 3x6), డేవిడ్‌ వార్నర్ ‌(48; 38 బంతుల్లో 3x4, 2x6) రాణించారు. ఓపెనర్‌ జానీ బెయిర్‌స్టో (16) ఐదో ఓవర్‌లో ఒక సిక్సర్‌ బాది జోరు మీద కనిపించగా.. ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. కార్తీక్‌ త్యాగి వేసిన ఈ ఓవర్‌లో మరో షాట్ ఆడబోయి సంజూ శాంసన్‌ చేతికి చిక్కాడు. దాంతో హైదరాబాద్‌ 23 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది.

పాండే హాఫ్ సెంచరీ:

పాండే హాఫ్ సెంచరీ:

అనంతరం వార్నర్‌, మనీష్‌ పాండే ఆచితూచి ఆడగా రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. వార్నర్‌ అర్ధ శతకానికి చేరువలో ఉండగా జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. ఆపై మనీష్‌ పాండే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా ఉనద్కత్‌ వేసిన 18వ ఓవర్‌లో పెవిలియన్‌ చేరాడు. చివర్లో కేన్ విలియమ్సన్ ‌(22; 12 బంతుల్లో 2x6), ప్రియమ్ ‌గార్గ్ ‌(15; 8 బంతుల్లో 1x4, 1x6) ధాటిగా ఆడటంతో రాజస్థాన్‌ ముందు 159 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. రాజస్థాన్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌, కార్తీక్‌ త్యాగీ, జయదేవ్ ఉనద్కత్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

‌MI vs DC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. పంత్ ఔట్.. రహానే ఇన్!!

Story first published: Sunday, October 11, 2020, 19:54 [IST]
Other articles published on Oct 11, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X