For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs RCB: నువ్వా.. నేనా.. సై.. ఎలిమినేటర్ గండం దాటేదెవరూ?

IPL 2020, SRH vs RCB preview: Who will win Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore in Eliminator
IPL 2020 Eliminator,SRH vs RCB Match Preview | Teams Details & Pitch Report

అబుదాబి: ఐపీఎల్ 2020 సీజన్‌లో మరో ఆసక్తికర పోరు. భిన్నమైన ఆటతీరుతో ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నేడు ఎలిమినేటర్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. వరుసగా ఐదోసారి ప్లే ఆఫ్స్ చేరుకున్న హైదరాబాద్ సెకండ్ టైటిల్‌పై గురిపెట్టగా.. మూడేళ్ల తర్వాత నాకౌట్‌కు వచ్చిన బెంగళూరు ఈ సారైనా విజేతగా నిలవాలని చూస్తోంది. అంతదూరం వెళ్లాలంటే ముందుగా ఎలిమినేటర్ గండాన్ని దాటాలి. మరి చివరి మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఊపు మీదున్న సన్‌రైజర్స్ జోరు కొనసాగిస్తుందై..? గత నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి డీలాపడ్డ ఆర్‌సీబీ పుంజుకుంటుందా? క్వాలిఫయర్2‌లో ఢిల్లీతో తలపడే జట్టేది?

ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టు లీగ్‌నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన జట్టుకు మాత్రం ఫైనల్‌ చేరేందుకు ఆదివారం ఢిల్లీతో జరిగే రెండో క్వాలిఫయర్‌ ద్వారా మరో అవకాశం ఉంటుంది. అయితే ఈ సీజన్‌లో ఇరు జట్లు చెరొక విజయాన్నందుకున్నాయి.

బలంగా హైదరాబాద్..

బలంగా హైదరాబాద్..

టోర్నీ ఆరంభంలో తడబడినా...ఇప్పుడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ తుది జట్టు సమతూకంగా ఉంది. అనూహ్యంగా ఓపెనింగ్‌ అవకాశం దక్కించుకున్న వృద్దిమాన్ సాహా చెలరేగుతుండటంతో మరో ఓపెనర్‌ డేవిడ్ వార్నర్‌పై భారం తగ్గింది. వీరిద్దరు మరోసారి శుభారంభం అందిస్తే ఆరెంజ్ ఆర్మీ భారీ స్కోరు చేసే అవకాశం ఉంటుంది. వీరితో పాటు మిడిలార్డర్‌లో మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ల్ సమద్‌ బాధ్యతగా ఆడాల్సి ఉంది. తుది జట్టులో అభిషేక్ శర్మ, ప్రియామ్ గార్గ్‌లలో ఒకరికి అవకాశం దక్కవచ్చు. ఆల్‌రౌండర్‌ జాసన్ హోల్డర్‌ రాకతో కూడా హైదరాబాద్‌ బలం పెరిగింది. రషీద్ ఖాన్, నదీమ్‌ స్పిన్‌ కీలకం కానుండగా...సందీప్‌ శర్మ మరోసారి చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. గత మూడు మ్యాచ్‌ల్లో రాణించినట్లు మరోసారి చెలరేగితో వార్నర్ సేనకు తిరుగుండదు.

విరాట్ కోహ్లీ, ఏబీడీపైనే ఆశలు..

విరాట్ కోహ్లీ, ఏబీడీపైనే ఆశలు..

అదృష్టవశాత్తూ రన్‌రేట్‌ సహకారంతో ప్లే ఆఫ్స్‌కు చేరినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. నాలుగు వరుస ఓటములతో ఆ జట్టు పూర్తిగా డీలాపడిపోయింది. ఏబీ డివిలియర్స్‌పై అతిగా ఆధారపడుతుండటం, కోహ్లీ తన స్థాయికి తగినట్లుగా ఆడకపోవడం కూడా జట్టును దెబ్బ తీస్తోంది. ఇప్పటి వరకు పడిక్కల్‌ ఒక్కడే నిలకడైన ప్రదర్శన చేశాడు. అతనికి తోడుగా ఫిలిప్ రాణించలేకపోతున్నాడు. పడిక్కల్ కూడా ధాటిగా ఆడలేకపోతున్నాడు. మంచి బౌలింగ్ లైనప్ ఉన్న సన్‌రైజర్స్‌పై ఓపెనర్లు మంచి ఆరంభం అందిస్తేనే ఆర్‌సీబీ భారీ స్కోరు చేయగలదు. అయితే ఏబీ, విరాట్‌లను ఔట్‌ చేస్తే పతనం మొదలైపోతుందని లీగ్‌లో ఇప్పటికే నిరూపితమైంది. బౌలింగ్‌లో స్పిన్నర్లు సుందర్, చహల్‌ కీలకం కానున్నారు. జట్టును గాయాలు కూడా వేధిస్తున్నాయి. మోరిస్, సైనీ పూర్తిగా కోలుకోలేదు. సిరాజ్‌నుంచి జట్టు మరో చక్కటి ప్రదర్శన ఆశిస్తోంది. మోరిస్ కోలుకోకుంటే మోయిన్ అలీ జట్టులోకి రావచ్చు.

ముఖాముఖీ

ముఖాముఖీ

ఐపీఎల్‌-2020లో ఇరు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లో చెరో విజయం నమోదు చేసుకున్నాయి. తొలి పోరులో బెంగళూరు 10 పరుగులతో గెలవగా, తర్వాతి మ్యాచ్‌లో హైదరాబాద్‌ 5 వికెట్లతో నెగ్గింది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 17 సార్లు తలపడగా.. 9-7తో హైదరాబాద్ లీడ్‌లో ఉంది. ఇక గత ఐదు మ్యాచ్‌ల్లో బెంగళూరు 2 గెలవగా.. హైదరాబాద్ 3 గెలిచింది.

టాస్‌ కీలకం...

టాస్‌ కీలకం...

అబుదాబిలో టాస్‌ మరోసారి కీలకంగా మారింది. ఇక్కడ గత ఐదు మ్యాచ్‌లో రెండో సారి బ్యాటింగ్‌ చేసిన జట్టే గెలిచింది. డ్యూ కారణంగా అన్ని జట్లు ఛేదనకే మొగ్గు చూపుతున్నాయి.

తుది జట్లు (అంచనా):

తుది జట్లు (అంచనా):

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), వృద్దిమాన్ సాహా(కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ/ప్రియామ్ గార్గ్, అబ్దుల్ సమాద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, షెబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టీ నటరాజన్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: జోష్ ఫిలిప్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్(వికెట్ కీపర్), శివమ్ దూబే, క్రిస్ మోరిస్/ మోయిన్ అలీ, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ/షెబాజ్ అహ్మద్, ఇసురు ఉడానా, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్

IPL 2020 బెస్ట్ ఎలెవన్‌ను ప్రకటించిన బ్రాడ్ హగ్.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌కు నో చాన్స్!

Story first published: Friday, November 6, 2020, 7:45 [IST]
Other articles published on Nov 6, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+