వామ్మో.. మళ్లీ బయో బుడగనా!!.. మా వల్ల కాదు: కోహ్లీ

దుబాయ్: బయో బుడగల్లో సుదీర్ఘంగా ఉండటం క్రికెటర్లకు మానసికంగా సవాలేనని టీమిండియా కెప్టెన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ అన్నాడు. క్రికెట్ పర్యటనలను నిర్ణయించేటప్పుడు బయో బుడగల్లో ఎక్కువ కాలం గడపడం వల్ల వచ్చే మానసిక సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించాడు. పదేపదే బుడగ వాతావరణంలో ఉండాలంటే కష్టమే అని కోహ్లీ పేర్కొన్నాడు. కరోనా కారణంగా క్రికెట్ సిరీస్‌లు అన్ని బుడగ వాతావరణంలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2020 కారణంగా ఇప్పటికే గత మూడు నెలలుగా క్రికెటర్లు అందరూ బుడగలో గడుపుతున్నారు.

మళ్లీ.. బుడగ కష్టమే:
యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 2020 ముగియగానే భారత క్రికెటర్లు ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరుతారు. అక్కడ జనవరి వరకు బయో బడుగలోనే ఉంటారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ బయో బుడగపై స్పందించాడు. శుక్రవారం అబుదాబి మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు కోహ్లీ బెంగళూరు టీవీతో మాట్లాడుతూ... 'పదేపదే బుడగ వాతావరణంలో ఉండాలంటే కష్టం. నచ్చిన బృందంలో ఉన్నంత వరకూ బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు బెంగళూరు బుడగలో అందరం ఆనందంగా ఉన్నాం. అందుకే ఆటను ఆస్వాదిస్తున్నాం' అని చెప్పాడు.

బయటకు వెళ్లే అవకాశం కల్పించాలి:
'అయితే మళ్లీ మళ్లీ బుడగ వాతావరణంలో ఉండాల్సి వస్తే మాత్రం కష్టం. అందుకే మానసికంగా ఇబ్బందులు లేకుండా పర్యటనలను రూపొందించాలి. అంటే.. టోర్నీ లేదా సిరీస్ ఎంతకాలం ఉంటుంది, బుడగ వాతావరణంలో మార్పులేమీ లేకుండా 80 రోజులు ఉండటం వల్ల ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం ఉంటుంది వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇక బుడగ తప్పదని అనుకుంటే కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతి ఇవ్వాలి. బయటకు వెళ్లే అవకాశం కల్పించాలి. ఇవన్నీ ఆలోచించాలి. ఎందుకంటే ఆటగాళ్లను మానసికంగా ఆరోగ్యంగా ఉంచడం ముఖ్యం' అని విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు.

మరో రెండున్నర నెలలు:
ఐపీఎల్ 2020 కారణంగా భారత ఆటగాళ్లంతా రెండు నెలలుగా బయో బుడగలోనే ఉంటున్నారు. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనకు వెళితే మరో రెండున్నర నెలలు ఇలానే ఉండాల్సి వస్తుంది. ఆపై ఇంగ్లాండ్ సిరీస్‌కూ బయో బుడగ తప్పదు. కరోనా తగ్గుముఖం పెట్టేవరకు క్రికెటర్లకు ఇది తప్పదు. బుడగ వాతావరణంలో ఎక్కువ రోజులు ఆడలేమనే ఉద్దేశంతోనే ఆసీస్ స్టార్ ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ తమ దేశంలో నిర్వహించే బిగ్‌బాష్‌లో ఆడలేమని చెబుతున్నారు. ఐపీఎల్ 2020 తర్వాత వాళ్లు కుటుంబంతో గడపనున్నారు.

నవంబర్ 12న ఆస్ట్రేలియాకు:
ఐపీఎల్ 2020 ముగిసిన అనంతరం విరాట్ కోహ్లీ నేతృత్వంలోని జంబో జట్టు నవంబర్ 12న ఆస్ట్రేలియాకు బయల్దేరనుంది. ఈ టూర్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీలో నవంబర్ 27న జరగనున్న తొలి వన్డేతో పర్యటన ఆరంభం అయి.. 2021, జనవరి 15న నాలుగో టెస్టు మ్యాచ్‌తో ముగుస్తుంది.
SRH vs RCB: కేన్ కాక కొట్టాడు.. సన్‌రైజర్స్ గెలిచింది!! ఇంటిదారి పట్టిన బెంగళూరు!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications