Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs RCB: ఇప్పుడే చెప్పడం తొందరపాటే.. అయినా చెప్పేస్తున్నా: వార్నర్

IPL 2020, SRH vs RCB: David Warner says We have been talking about Delhi Capitals bowling unit
IPL 2020 : David Warner About Delhi Capitals Bowling Unit

అబుదాబి: ఐపీఎల్ 2020 ప్లేఆఫ్స్‌కు చేరాల్సిన సమయంలో టాప్‌ మూడు జట్లను ఓడించాలని తెలుసని, టోర్నీలో ఇక్కడి దాకా వచ్చిందనదుకు ప్రశాంతంగా ఉందని సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్ డేవిడ్ వార్నర్ చెప్పాడు. ఇప్పుడే చెప్పడం తొందరపాటే అని తెలిసినా.. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్‌ యూనిట్‌ గురించి చర్చిస్తున్నాం అని పేర్కొన్నాడు. శుక్రవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన ఎలిమినేటర్‌లో 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ గెలిచింది. కప్పు కొట్టడమే లక్ష్యంగా బరిలో దిగిన సన్‌రైజర్స్‌ మరో అడుగు ముందుకేసింది.

హోల్డర్‌తో వేయించాలని ముందే అనుకున్నాం:

హోల్డర్‌తో వేయించాలని ముందే అనుకున్నాం:

మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్ డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ... 'మొదటగా మేం ప్లేఆఫ్స్‌కు చేరాల్సిన సమయంలో టాప్‌ మూడు (ఢిల్లీ, బెంగళూరు, ముంబై) జట్లను ఓడించాలని తెలుసు. అలాగే ఇక్కడి దాకా వచ్చి ఈ మ్యాచ్‌ కూడా గెలుపొందాం. దాంతో ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మా జట్టులో రషీద్‌ ఖాన్‌, టీ నటరాజన్‌ ప్రభావవంతమైన ఆటగాళ్లు. ఎలిమినేటర్‌ మ్యాచ్ కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నాం. తొలి ఐదు ఓవర్లను సందీప్‌ శర్మ, జాసన్ హోల్డర్‌తో వేయించాలని ముందే అనుకున్నాం. తర్వాత రషీద్‌, నటరాజన్‌కు అవకాశం ఇవ్వాలని ప్రణాళికలు వేసుకున్నాం. ఈ క్రమంలోనే రషీద్‌పై ఒత్తిడి పెరిగింది' అని చెప్పాడు.

ఢిల్లీ బౌలింగ్‌ యూనిట్‌ గురించి చర్చిస్తున్నాం:

ఢిల్లీ బౌలింగ్‌ యూనిట్‌ గురించి చర్చిస్తున్నాం:

'కేన్‌ విలియమ్సన్‌ లాంటి బ్యాట్స్‌మెన్‌ మా జట్టుకు విలువైన ఆటగాడు. అతడు క్రీజులో పాతుకుపోయి.. ఒత్తిడిలో రాణించగలడు. ఈరోజు అదే చేశాడు. అతడి ఇన్నింగ్స్ సూపర్. ఇక తొలి ఇన్నింగ్స్‌లో బెంగళూరు బ్యాటింగ్‌ లైనప్‌ చూశాక ఈ వికెట్‌ తేడాగా ఉందని అనిపించింది. అలాంటి పరిస్థితుల్లోనే చక్కగా ఆడాం. తర్వాతి మ్యాచ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాలి. ఇప్పుడే చెప్పడం తొందరపాటే.. అయినా చెప్పేస్తున్నా. ఢిల్లీ బౌలింగ్‌ యూనిట్‌ గురించి చర్చిస్తున్నాం. వారికి ప్రపంచ స్థాయి బౌలింగ్ యూనిట్ ఉంది. ఆ మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అని డేవిడ్‌ వార్నర్‌ పేర్కొన్నాడు.

నాకన్నా ప్రశాంతంగా ఉన్నాడు:

నాకన్నా ప్రశాంతంగా ఉన్నాడు:

కేన్‌ విలియమ్సన్‌ మాట్లాడుతూ... 'బెంగళూరు లాంటి జట్టుతో పోటీపడటం ఎప్పుటికీ తేలిక కాదు. ఆ జట్టులో టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉంన్నారు. పిచ్‌ కష్టంగా అనిపించింది. ఛేదించడం అంత తేలిక కాదు. బెంగళూరును తక్కువ స్కోరుకు పరిమితం చేయడం మాకు సవాలుగా మారింది. అలాగే బెంగళూరుకు కూడా ఇద్దరు ప్రపంచశ్రేణి స్పిన్నర్లు ఉన్నారు. వాళ్లిద్దరి బౌలింగ్‌లో ఎక్కువ వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తగా ఆడాం. జేసన్‌ హోల్డర్‌ కూడా అద్భుతంగా ఆడాడు. కీలక సమయంలో అతడు బాదిన బౌండరీలు ఎంతో ఉపయోగపడ్డాయి. అతడు నాకన్నా ప్రశాంతంగా ఉన్నాడు. జట్టులో ఆల్‌రౌండర్‌ స్థానాన్ని సంపూర్ణంగా భర్తీ చేశాడు' అని చెప్పాడు.

కేన్ రాణించాడు:

కేన్ రాణించాడు:

ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ అఖరి ఓవర్‌లో సన్‌రైజర్స్ విజయాన్ని అందుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ ‌(56) అర్ధ శతకంతో రాణించాడు కానీ లేదంటే పరిస్థితి మరీ ఘోరంగా ఉండేది. సునాయాస లక్ష్యాన్ని సన్‌రైజర్స్ 19.4 ఓవర్లలోనే ఛేదించింది. హాఫ్ సెంచరీతో సన్‌రైజర్స్‌ని గెలిపించిన కేన్ విలియమ్సన్ (50: 44 బంతుల్లో 2x4, 2x6)కి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డ్ లభించింది.

SRH vs RCB: ఆ క్యాచ్ పట్టిఉంటే.. మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది: కోహ్లీ

Story first published: Saturday, November 7, 2020, 13:05 [IST]
Other articles published on Nov 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+