SRH vs MI: ప్చ్.. డేవిడ్ వార్నర్ రాణించినా హైదరాబాద్‌కు తప్పని ఓటమి!

షార్జా: ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండ్‌షోకు సన్‌రైజర్స్ హైదరాబాద్ దాసోహమైంది. భారీ హిట్టర్ల బ్యాటింగ్ ముందు తేలిపోయింది. ఆ తర్వాత కట్టుదిట్టమైన బౌలింగ్‌కు చేతులెత్తేసింది. దాంతో ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 34 రన్స్‌తో ఓటమిపాలైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 రన్స్ చేసింది. క్వింటన్ డికాక్(39 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 67) హాఫ్ సెంచరీకి తోడుగా ఇషాన్ కిషాన్(31), హార్దిక్ పాండ్యా(28), కృనాల్ పాండ్యా(20) మెరుపులు మెరిపించారు. హైదరాబాద్ బౌలర్లలో సందీప్, కౌల్ రెండు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.
అనంతరం హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 రన్స్‌కే పరిమితమై ఓటమిపాలైంది. కెప్టెన్ డేవిడ్ వార్నర్(44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 60) రాణించినా ఫలితంలేకపోయింది. ముంబై బౌలర్లలో బౌల్ట్, ప్యాటిన్సన్, బుమ్రా రెండేసి వికెట్లు తీయగా.. కృనాల్ పాండ్యా ఒక వికెట్ తీశాడు.

నిరాశపర్చిన బెయిర్ స్టో..
209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌కు మంచి స్టారే లభించింది. కానీ ఓపెనర్ బెయిర్ స్టో(25) ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మనీష్ పాండే(30), డేవిడ్ వార్నర్(ధాటిగా ఆడటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది.

వార్నర్ హాఫ్ సెంచరీ..
పవర్ ప్లే అనంతరం మరింత జోరు పెంచిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. రాహుల్ చాహర్ ఓవర్ వేసిన 9వ ఓవర్‌లో మనీష్ పాండే, వార్నర్ చెరొక సిక్స్ కొట్టి 16 రన్స్ పిండుకున్నారు. ఇక పాటిన్సన్ వేసిన మరుసటి ఓవర్‌లో మనీష్ పాండే భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో క్విక్ సింగిల్ తీసిన వార్నర్ హాఫ్ సెంచరీ పూర్తి చేస్తున్నాడు.

విఫలమైన కేన్, ప్రియమ్ గార్గ్..
క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్(3), ప్రియమ్ గార్గ్(8) ఓవర్ వ్యవధిలోనే ఔటయ్యారు. బౌల్ట్ బౌలింగ్‌లో విలియమ్సన్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా..కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన గార్గ్.. చాహర్ సూపర్ క్యాచ్‌కు పెవిలియన్ బాటపట్టాడు. ప్యాటిన్సన్ వేసిన ఆ మరుసటి ఓవర్‌లోనే ఇషాన్ కిషన్ సూపర్ క్యాచ్‌కు వార్నర్ ఔటయ్యాడు. వార్నర్ ఆడిన లెగ్ కట్టర్‌ను.. థర్డ్ మ్యాన్‌లో ఉన్న కిషాన్.. సూపర్ డైవ్‌తో అందుకున్నాడు. దీంతో హైదరాబాద్ కష్టాలో పడింది.

చివర్లో అభిషేక్, అబ్ధుల్ సమాద్..
బుమ్రా వేసిన 17వ ఓవర్లో అబ్దుల్ సమాద్ 6,4తో ఆశలు రేకెత్తించాడు. కానీ 18వ ఓవర్‌ను కట్టడిగా వేసిన బౌల్ట్ నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక బుమ్రా వేసి 19వ ఓవర్‌లో భారీ సిక్సర్ కొట్టిన అబ్దుల్ సమాద్.. ఆ వెంటనే భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటవ్వడంతో హైదరాబాద్ ఓటమి ఖాయమైంది. ఆ తర్వాత అభిషేక్ శర్మ(10) క్లీన్ బౌల్డ్ కాగా.. హైదరాబాద్ విజయానికి ఆఖరి ఓవర్‌లో 37 పరుగులు అవసరమయ్యాయి. ఆఖరి ఓవర్‌లో 2 రన్స్ మాత్రమే రావడంతో ముంబై విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications