
షార్జా: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ ఆదిలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. చిన్నమైదానమైన షార్జాలో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన రోహిత్ శర్మ(6) తీవ్రంగా నిరాశపరిచాడు. భువనేశ్వర్ కుమార్ స్థానంలో జట్టులోకి వచ్చిన సందీప్ శర్మ అద్భుత బౌలింగ్‌కు రోహిత్ వెనుదిరిగాడు.
మొదటి మూడు బంతులను డిఫెన్స్ చేసిన రోహిత్.. నాలుగో బంతిని భారీ సిక్సర్‌గా మలించాడు. ఆ మరుసటి బంతిని సందీప్ ఔట్‌సైడ్ ఆఫ్‌స్టంప్‌గా వేయగా.. ఈ బంతిని వెంటాడిన రోహిత్ శర్మ కీపర్ జానీ బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చాడు.
బంతి బ్యాట్ అంచును తాకుతూ వెళ్లడంతో బెయిర్‌స్టో అప్పీల్ చేయగా.. అంపైర్ ఔటివ్వలేదు. దీంతో వెంటనే సన్‌రైజర్స్ డీఆర్ఎస్ కోరింది. రిప్లేలో బంతి బ్యాట్ చివర్లో తాకినట్లు తేలడంతో రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఆచితూచి ఆడాడు. డికాక్‌తో కలిసి వీలుచిక్కిన బంతిని బౌండరీలకు తరలించాడు.
సిద్దార్థ్ కౌల్ వేసిన 6 ఓవర్ చివరి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన సూర్యకుమార్ యాదవ్(27) క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో ముంబై పవర్ ప్లే ముగిసే సరికి 2 వికెట్లకు 48 పరుగులే చేసింది. క్రీజులో డికాక్, ఇషాన్ కిషాన్ ఉన్నారు.
ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ రెండో స్థానానికి చేరుకున్నాడు. ధోనీ 194 మ్యాచ్‌లు ఆడగా.. 193 మ్యాచ్‌లతో సురేశ్ రైనా, రోహిత్ శర్మ తర్వాతి స్థానాల్లో నిలిచారు. సురేశ్ రైనా ఈ సీజన్‌కు దూరమైన నేపథ్యంలో తర్వాతి మ్యాచ్‌లో రోహిత్.. అతణ్ని వెనక్కి నెట్టనున్నాడు.