Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs MI: ముంబై సిక్సర్ల మోత.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ లక్ష్యం..!

De Kock 67, middle-oder cameos help Mumba

షార్జా: ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ సిక్సర్ల మోత మోగించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ముందు 209 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. క్వింటన్ డికాక్(67) హాఫ్ సెంచరీకి తోడు.. ఇషాన్ కిషన్(31), హార్దిక్ పాండ్యా(28), కీరన్ పోలార్డ్(25 నాటౌట్), కృనాల్(4 బంతుల్లో 20) మెరుపులు మెరిపించడంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 208 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో సందీప్ శర్మ, కౌల్ రెండేసి వికెట్లు తీయగా.. రషీద్ ఒక వికెట్ పడగొట్టాడు. అయితే చివర్లో కౌల్ తేలిపోవడంతో ముంబై 200 మార్క్‌ను ధాటగలిగింది.

శుభారంభం దక్కలేదు..

ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం దక్కలేదు. సందీప్ శర్మ వేసిన తొలి ఓవర్‌‌లోనే రోహిత్ శర్మ(6) వెనుదిరిగాడు. భారీ సిక్సర్ కొట్టి టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన హిట్ మ్యాన్.. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసిన ఆ మరుసటి బంతిని వెంటాడి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. తొలుత ఫీల్డ్ అంపైర్ ఔట్ఇవ్వకపోవడంతో సన్‌రైజర్స్ రివ్యూకు వెళ్లి ఫలితం సాధించింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్‌(27)‌తో డికాక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఓవర్‌కో బౌండరీ రాబడుతూ ఈ జోడీ రన్ రేట్ తగ్గకుండా జాగ్రత్తపడింది. అయితే సిద్దార్థ్ కౌల్ వేసిన 6 ఓవర్ చివరి బంతికి భారీ షాట్‌కు ప్రయత్నించిన సూర్యకుమార్ యాదవ్(27) క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో ముంబై పవర్ ప్లే ముగిసే సరికి 2 వికెట్లకు 48 పరుగులే చేసింది.

డికాక్ సూపర్ ఫిఫ్టీ..

అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్‌తో ధాటిగా ఆడిన డికాక్ సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే అబ్దుల్ సమాద్ వేసిన ఏడో ఓవర్ 5వ బంతిని డికాక్ లాంగాన్‌లో భారీ షాట్ ఆడగా.. బౌండరీ లైన్ వద్ద మనీష్ పాండే జారవిడిచాడు. ఈ అవకాశంతో చెలరేగిన డికాక్.. విలియమ్సన్ వేసిన 12వ ఓవర్ మూడో బంతికి భారీ సిక్సర్ కొట్టి ఈ సీజన్‌లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. అదే ఊపులో మరింత ధాటిగా ఆడిన డికాక్‌ను రషీద్ ఖాన్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు.

నాలుగు బంతుల్లో నాలుగు బౌండరీలు..

వికెట్ పడినా పాండ్యాతో కలిసి ఇషాన్ కిషన్ భారీ షాట్లు కొట్టాడు. అయితే సందీప్ శర్మ బౌలింగ్‌లో మనీష్ పాండే సూపర్ క్యాచ్‌కు ఇషాన్ వెనుదిరిగాడు. ఆ తర్వాత రషీద్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 16వ ఓవర్‌లో 2 పరుగులు మాత్రమే వచ్చాయి. దాంతో ముంబై పరుగుల వేగం తగ్గింది.

నటరాజన్ బౌలింగ్‌లో పాండ్యా సిక్స్ కొట్టగా.. సందీప్ ఓవర్‌లో పొలార్డ్ రెండు సిక్స్‌లు బాదాడు. ఆఖరి ఓవర్‌లో కౌల్ యార్కర్‌కు పాండ్యా క్లీన్ బౌల్డ్ కాగా.. క్రీజులోకి వచ్చిన కృనాల్ 6,4,4,6 వరుస బౌండరీలతో చెలరేగడంతో ముంబై 208 భారీ స్కోర్ చేసింది.

Story first published: Sunday, October 4, 2020, 17:38 [IST]
Other articles published on Oct 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+