Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs MI: ముంబైతో మ్యాచ్‌ సన్‌రైజర్స్‌కు మేలే.. ఎలాగో చెప్పిన బ్రియాన్ లారా!!

IPL 2020, SRH vs MI: Brian Lara believes SunRisers Hyderabad beat Mumbai Indians

షార్జా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా ఈ రోజు చివరి లీగ్‌ మ్యాచ్‌ జరగనుంది. షార్జా మైదానంలో ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సిద్ధమైంది. ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసులో అగ్రస్థానంలో కొనసాగుతున్న ముంబై ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా ఆ జట్టుకు ఎలాంటి నష్టం జరగదు. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌కు మాత్రం ఈ మ్యాచ్‌ చావోరేవో అనే పరిస్థితి. ముంబైతో మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్‌ చేరుతుంది.. ఓడిపోతే కేకేఆర్‌ వెళుతుంది. అయితే ముంబైతో జరిగే మ్యాచ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు మేలు చేయనుందని ఓ మాజీ దిగ్గజం పేర్కొన్నాడు.

లారా జోస్యం:

లారా జోస్యం:

పట్టికలో నెం.1 స్థానంలో కొనసాగుతూ మంచి జోరుమీదుంది ముంబై ఇండియన్స్. దాంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఈరోజు రాత్రి మ్యాచ్‌లో చెమటోడ్చాల్సి వస్తుందని అందరూ అంచనాలు వేస్తున్నారు. అయితే సులువుగా ముంబైని హైదరాబాద్ ఓడించేస్తుందని వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం, ప్రముఖ వ్యాఖ్యాత బ్రియాన్ లారా జోస్యం చెప్పాడు. ముంబైతో జరిగే మ్యాచ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌కు మేలు చేయనుందని అంటున్నాడు. ఈ మ్యాచ్ కోసం ముంబై సీనియర్ ఆటగాళ్లకి రెస్ట్ ఇచ్చే అవకాశం ఉందని, అది సన్‌రైజర్స్‌కి మరింత కలిసిరానుందన్నాడు. లారా ప్రస్తుతం ఐపీఎల్ 2020 కోసం వ్యాఖ్యాతల బృందంలో ఉన్నాడు.

ముంబైని హైదరాబాద్ ఓడిస్తుంది:

ముంబైని హైదరాబాద్ ఓడిస్తుంది:

తాజాగా బ్రియాన్ లారా మాట్లాడుతూ... 'షార్జాలో ముంబైని హైదరాబాద్ ఓడిస్తుంది. గత కొన్ని మ్యాచ్‌లుగా సన్‌రైజర్స్ టీమ్‌లోని ఆటగాళ్లు ఫామ్‌ని కొనసాగిస్తున్నారు. ఈరోజు మ్యాచ్‌లోనూ వాళ్లు సత్తాచాటే అవకాశం ఉంది. ముంబై ఈ మ్యాచ్‌లో సమూల మార్పులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే లీగ్‌లో టాప్‌ స్థానంలో నిలిచి ప్లేఆఫ్ చేరిన ముంబై ఈ మ్యాచ్‌ను పెద్దగా పట్టించుకోదనే అనుకుంటున్నా. ఇప్పటివరకు అవకాశం రాని ఇద్దరు ముగ్గురు ఆటగాళ్లకు ముంబై తుది జట్టులో చోటు లభించే అవకాశం ఉంది. ఈ అవకాశం ఎస్‌ఆర్‌హెచ్‌కు లాభం చేకూర్చనుంది. దీనిని వినియోగింకొని ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేఆఫ్‌ చేరుతుందనే అనుకుంటున్నా' అని పేర్కొన్నాడు.

హైదరాబాద్ గెలిస్తే.. కోల్‌కతా ఇంటికి:

హైదరాబాద్ గెలిస్తే.. కోల్‌కతా ఇంటికి:

ముంబై ఇప్పటి వరకూ 13 మ్యాచ్‌లాడి 9 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. హైదరాబాద్ 13 మ్యాచ్‌లకిగానూ ఆరింట్లో మాత్రమే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న హైదరాబాద్ ఈరోజు మ్యాచ్‌లో ఓడిపోతే.. ఏడు విజయాలతో నాలుగో స్థానంలో ఉన్న కోల్‌కతా చివరి ప్లేఆఫ్‌ బెర్తుని ఖాయం చేసుకుంది. ఒకవేళ హైదరాబాద్ గెలిస్తే.. అప్పుడు కోల్‌కతా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఐపీఎల్ 2019 సీజన్‌లో ప్లేఆఫ్ ఆఖరి బెర్తుని లీగ్ దశ చివరి రోజున హైదరాబాద్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. తాజా సీజన్‌లోనూ ఈరోజు లీగ్ దశ మ్యాచ్‌లు ముగియనున్నాయి. మరి ఈరోజు ఏం జరుగుతుందో చూడాలి.

అనుష్క జీ.. మునుపెన్నడూ లేనంతగా అందంగా ఉన్నారు!! ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న క్యూట్ ఫోటోస్!

Story first published: Tuesday, November 3, 2020, 20:45 [IST]
Other articles published on Nov 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+