Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనుష్క జీ.. మునుపెన్నడూ లేనంతగా అందంగా ఉన్నారు!! ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్న క్యూట్ ఫోటోస్!

IPL 2020, DC vs RCB: Anushka Sharma cheering for Virat Kohli

దుబాయ్: సోమవారం రాత్రి అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్‌కు చేరింది. అయితే ఓడినా మెరుగైన రన్‌రేటుతో బెంగళూరు కూడా ప్లేఆఫ్‌ బెర్త్ ఖరారు చేసుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 152 పరుగులు చేసింది. దేవదత్‌ పడిక్కల్‌ (50; 41 బంతుల్లో, 5×4), ఏబీ డివిలియర్స్‌ (35; 21 బంతుల్లో, 1×4, 2×6) రాణించారు. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ 19 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అజింక్య రహానె (60; 46 బంతుల్లో, 5×4, 1×6), శిఖర్‌ ధావన్‌ (54; 41 బంతుల్లో, 6×4) అర్ధ శతకాలతో అదరగొట్టారు.

ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సందడి చేశారు. దుబాయ్‌లోని షేక్ జాయెద్ స్టేడియంలో మ్యాచ్ ఆసాంతం కోహ్లీని ఉత్సాహా పరుస్తూ కనిపించారు. స్టేడియం లాంచ్‌లో కూర్చొని ఆర్సీబీ టీంను ఎంకరేజ్ చేశారు. ఆ సమయంలో అనుష్క శర్మ బేబి బంప్ స్పష్టంగా కనిపించింది. ఒకవైపు మ్యాచ్ చూస్తూ.. మరోవైపు యుజ్వేంద్ర చహల్ కాబోయే సతీమణి ధనశ్రీ వర్మతో మాట్లాడుతూ సరదాగా గడిపారు.

విరాట్ కోహ్లీని అనుష్క శర్మ ఉత్సాహా పరుస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఫోటోలలో అనుష్క తెలుపు రంగు దుస్తులు ధరించి ఎంతో అందంగా ఉన్నారు. ఈ ఫోటోలపై అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'అనుష్క జీ.. మునుపెన్నడూ లేనంతగా అందంగా ఉన్నారు' అని ఒకరు ట్వీట్ చేసారు. 'ఈ రోజు అనుష్క చుట్టూ ఎటువంటి ప్రతికూలత లేదు', 'అనుష్క శర్మను రక్షించండి' అని ఫాన్స్ ట్వీట్లు పెడుతున్నారు. విరాట్ జట్టు మ్యాచ్ ఓడిన కొన్ని సందర్భాల్లో అనుష్కను ఆడుకున్న విషయం తెలిసిందే. అయితే గతరాత్రి బెంగళూరు ఓడినా ప్లేఆఫ్‌ బెర్త్ ఖరారు చేసుకుంది కాబట్టి.. అనుష్కను ఏమనొద్దని ట్వీట్స్ చేస్తున్నారు.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు 2013లో ఓ షాంపూ ప్రకటన కోసం చేసిన చిత్రీకరణలో మొదటిసారి కలుసుకున్నారు. నాలుగేళ్ల పాటు ప్రేమాయణం నడిపిన విరాట్-అనుష్క.. 2017, డిసెంబర్ 11న ఇటలీలో వివాహం చేసుకున్నారు. కోహ్లీతో వివాహం అయినప్పటి నుండి అనుష్క పెద్దగా సినిమాలు చెయ్యట్లేదు. పూర్తి సమయం కోహ్లీతోనే గడుపుతున్నారు. 32 ఏళ్ల అనుష్క శర్మ చివరిగా 'జీరో' సినిమాలో వెండితెరపై కనిపించారు. అనుష్క వచ్చే ఏడాది జనవరి ముగిసేలోగా ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ప్రస్తుతం ఆమె కోహ్లీతో కలిసి యూఏఈలో ఐపీఎల్ ఎంజాయ్ చేస్తున్నారు.

Story first published: Tuesday, November 3, 2020, 18:48 [IST]
Other articles published on Nov 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+