న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs KKR: రాణించిన మోర్గాన్, కార్తీక్.. సన్‌రైజర్స్‌కు టఫ్ టార్గెట్!

Eoin Morgan, Dinesh Karthik late charge helps Kolkata post 163

అబుదాబి: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 164 పరుగుల లక్ష్యాన్నినిర్ధేశించింది. చివర్లో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్( 23 బంతుల్లో 34), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 29 నాటౌట్) అద్భుత భాగస్వామ్యం అందించడంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 163 రన్స్ చేసింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. రషీద్ ఖాన్, విజయ్ శంకర్, బసిల్ థంపీ ఒక వికెట్ తీశాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి(23) శుభారంభాన్ని అందించారు. నటరాజన్ వేసిన నాలుగో ఓవర్‌లో త్రిపాఠి 6, 4 కొట్టగా.. బసిల్ థంపి బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ హ్యాట్రిక్ ఫోర్స్‌తో ధాటిగా ఆడాడు. అయితే ఆరో ఓవర్ ఆఖరి బంతికి నటరాజన్ క్లీన్ బౌల్ట్ కావడంతో కోల్‌కతా పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టానికి 48 రన్స్ చేసింది. అనంతరం కోల్‌కతా దూకుడుకు బ్రేక్ పడింది.

రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన శుభ్‌మన్(36).. ప్రియామ్ గార్గ్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే నితీష్ రాణా(29) కూడా గార్గ్‌కు చిక్కి ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన రస్సెల్(9) కూడా మరోసారి నిరాశపరిచాడు. తన వైఫల్యాన్ని కొనసాగిస్తూ నటరాజన్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

ఈ పరిస్థితుల్లో దినేశ్ కార్తీక్,కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బాధ్యతాయుతంగా ఆడారు. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలిస్తూ స్కోర్ బోర్డును పరుగెత్తించే ప్రయత్నం చేశారు. ఆఖరి మూడు ఓవర్లలో 42 పరుగులు చేయడంతో కేకేఆర్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. ఆఖరి బంతికి మోర్గాన్ మనీష్ పాండే సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 58 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

Story first published: Sunday, October 18, 2020, 17:33 [IST]
Other articles published on Oct 18, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X