Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs DC: హైదరాబాద్‌దే బ్యాటింగ్.. జట్టులో భారీ మార్పులు.. బెయిర్ స్టో ఔట్

Sunrisers Hyderabad vs Delhi Capitals

దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌గా డ్రై ఉండటం, డ్యూ ప్రభావం ఉండే చాన్స్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నానని ఢిల్లీ సారథి శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నామన్నాడు. ఇక తాము టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. జట్టులో మూడు మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపాడు. బెయిర్ స్టో, ప్రియామ్ గార్గ్, ఖలీల్ స్థానాల్లో విలియమ్సన్, వృద్దిమాన్ సాహా, నదీమ్‌లు వచ్చారన్నాడు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ చేతిలో శనివారం ఎదురైన అనూహ్య ఓటమి తర్వాత సన్ రైజర్స్ ప్లే ఆఫ్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. తమకు మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఓడితే సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించినట్టే. జాసన్ హోల్డర్ చేరికతో బౌలింగ్ బలం పెరగడం, చివరిసారి ఆడినప్పుడు ఢిల్లీపై గెలవడం హైదరాబాద్ జట్టుకు సానుకూల అంశాలు. ఐపీఎల్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడగా హైదరాబాద్ 10 సార్లు, ఢిల్లీ 6 సార్లు గెలిచింది. గత ఐదు మ్యాచ్‌ల్లో మాత్రం మూడింటిలో హైదరాబాద్ గెలవగా.. రెండింటిలో ఢిల్లీ విజయం సాధించింది. గత సీజన్‌లో ఇరు జట్ల మధ్య ఫ్లేఆప్‌తో సహా మూడు మ్యాచ్‌లు జరగ్గా రెండింటిలో ఢిల్లీనే గెలవడం విశేషం.

తుది జట్లు:

హైదరాబాద్‌: డేవిడ్‌ వార్నర్ ‌(కెప్టెన్‌), కేన్ విలియమ్సన్, మనీశ్‌ పాండే, విజయ్ శంకర్, వృద్ధిమాన్‌ సాహా, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్‌ ఖాన్‌, సందీప్ శర్మ, నదీమ్, టీ నటరాజన్‌.

ఢిల్లీ: శిఖర్‌ ధావన్, అజింక్యా రహానే, శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్ ‌పంత్‌, షిమ్రాన్ హెట్‌మైయిర్‌‌, మార్కస్ స్టొయినిస్‌, అక్షర్ ‌పటేల్‌, అశ్విన్, కాగిసో రబాడా, అన్రిచ్ నోర్జ్

Story first published: Tuesday, October 27, 2020, 19:18 [IST]
Other articles published on Oct 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+