SRH vs DC: వృద్దిమాన్ సాహా, డేవిడ్ వార్నర్ పరుగుల విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ లక్ష్యం!

దుబాయ్: వృద్దిమాన్ సాహా(45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87), డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66) పరుగుల విధ్వంసం సృష్టించడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. వీరి విధ్వంసానికి మనీష్ పాండే(31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 44 నాటౌట్ ) క్లాస్ ఇన్నింగ్స్ తోడవడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లకు 219 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో నోర్జ్, అశ్విన్ చెరొక వికెట్ తీశారు. ఇక సీజన్ ఆరంభం నుంచి ప్రతీ మ్యాచ్‌లో కనీసం ఒక వికెట్ అయినా తీస్తున్న రబడా ఈ మ్యాచ్‌లో తేలిపోయాడు.

అదిరే ఆరంభం..
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్.. ఆరంభం నుంచి ధాటిగా ఆడింది. నోర్జ్ వేసిన ఫస్ట్ ఓవర్‌లో 5 పరుగులే వచ్చినా.. రబడా బౌలింగ్‌లో సహా బ్యాక్ టు బ్యాక్ బౌండరీలు కొట్టడంతో 15 రన్స్ వచ్చాయి. అనంతరం ఓవర్‌కు 10 పరుగులు తగ్గకుండా ఈ జోడీ చెలరేగింది. ఇక రబడా వేసిన ఆరో ఓవర్‌లో వార్నర్ 4, 4, 0, 6, 4, 4 కొట్టడంతో 22 రన్స్ వచ్చాయి. దాంతో పవర్ ప్లే ముగిసే సరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఈ సీజన్ ఇప్పటి వరకు ఇదే హయ్యెస్ట్ పవర్ ప్లే స్కోర్. మరోవైపు వార్నర్ ఆఫ్ సెంచరీ కూడా పూర్తయింది.

విడదీసిన అశ్విన్..
అనంతరం కొంత పరుగుల వేగం తగ్గినా.. రన్ రేట్ తగ్గకుండా ఈ జోడీ జాగ్రత్తపడింది. అయితే అశ్విన్ వేసిన 10వ ఓవర్‌లో బౌండరీ కొట్టిన వార్నర్ ఆ మరుసటి బంతిని ఎక్స్‌ట్రా కవర్స్ దిశగా భారీ షాట్ ఆడి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 107 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం మనీష్ పాండే క్రీజులోకి రాగా.. తుషార్ దేశ్ పాండే వేసిన 11వ ఓవర్‌లో సాహా డీప్ స్క్వేర్ దిశగా బౌండరీ కొట్టి హాఫ్ సెంచరీ సాధించాడు.
అనంతరం మరింత ధాటిగా ఆడిన అతను.. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్, రబడా బౌలింగ్‌లో మరో భారీ సిక్సర్ కొట్టాడు. అదే జోరులో నోర్జ్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టిన సాహా.. మిడాఫ్ మీదుగా భారీ షాట్‌కు ప్రయత్నించి అయ్యర్‌కు చిక్కాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 69 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

చివర్లో తగ్గిన దూకుడు..
క్రీజులోకి వచ్చిన కేన్ విలియమ్సన్‌తో మనీష్ పాండే ఇన్నింగ్స్‌నుముందుకు నడిపించాడు. తుషార్ బౌలింగ్‌లో పాండే రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో 15 రన్స్ పిండుకున్నాడు. దీంతో హైదరాబాద్ 250 పరుగులు చేస్తుందా? అనిపించింది. కానీ ఢిల్లీ బౌలర్లు చివరి మూడు ఓవర్లలో కట్టుదిట్టంగా బంతులేయడంతో 22 పరుగులే వచ్చాయి. దాంతో హైదరాబాద్ 219 రన్స్‌కే పరిమితమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications