Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs DC: ఐపీఎల్‌లో తొలిసారి బౌలింగ్ చేసిన వార్నర్.. అది కూడా ఒక్క బంతే (వీడియో)

IPL 2020, SRH vs DC: David Warner bowls for the first time in IPL

దుబాయ్: ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ సత్తాచాటింది. మంగళవారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌పై వీరవిహారం చేసింది. మొదట పరుగుల వరద పారించి.. ఆపై బౌలింగ్‌లోనూ అదరగొట్టి అద్భుత విజయాన్ని అందుకుంది. ముందుగా సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.

వృద్ధిమాన్‌ సాహా (45 బంతుల్లో 87; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్‌ (34 బంతుల్లో 66; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడి హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం ఢిల్లీ 19 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. రిషబ్ పంత్‌ (35 బంతుల్లో 36; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌. రషీద్‌ ఖాన్‌ (3/7) అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు.

వార్నర్ బౌలింగ్

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌ బౌలింగ్ చేశాడు. ఐపీఎల్‌లో వార్నర్‌ బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి. అయితే వార్నర్ కేవలం ఒకే క్క బంతి వేశాడు. అదెలాగంటే.. ఇన్నింగ్స్ 10వ ఓవర్ బౌలింగ్ చేసిన విజయ్ శంకర్ 7 పరుగులు ఇచ్చాడు. 12వ మూడో బంతికి ఢిల్లీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను ఔట్ చేశాడు. ఐదో బంతి అనంతరం అతడు గాయపడ్డాడు. ఎడమ కాలి తొడ కండరం పట్టేయడంతో మరో బంతి వేయకుండానే శంకర్ మైదానాన్ని వీడాడు. దీంతో వార్నర్ చివరి బంతిని పూర్తి చేశాడు. అయితే మొదటగా వైడ్ వేసిన వార్నర్.. తర్వాత లీగల్ డెలివరీ వేశాడు. వార్నర్ ఒక బంతి వేసి రెండు పరుగులు ఇచ్చాడు.

సాహాకు గాయం

సాహాకు గాయం

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 13 మందితో ఆడింది. ఓపెనర్ జానీ బెయిర్‌స్టోను పక్కనబెట్టిన సారథి వార్నర్.. వృద్ధిమాన్‌ సాహాను తుది జట్టులోకి తీసుకున్నాడు. ఈ సీజన్లో తొలిసారి ఓపెనర్‌గా బరిలో దిగిన సాహా.. అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొదట క్రీజులో కుదురుకోవడానికి సమయం తీసుకున్న సాహా.. ఆ తర్వాత గేర్ మార్చాడు. 45 బంతుల్లో 87 రన్స్ చేశాడు. బ్యాటింగ్ చేస్తుండగా.. గాయపడిన సాహా వికెట్ కీపింగ్ చేయడానికి మైదానంలోకి రాలేదు. అతడి స్థానంలో సబ్‌స్టిట్యూట్ శ్రీవాత్స్ గోస్వామి వికెట్ కీపింగ్ చేశాడు.

13 మందితో బరిలోకి

13 మందితో బరిలోకి

బౌలింగ్ చేస్తుండగా తొడ కండరం పట్టేయడంతో మరో బంతి వేయకుండానే విజయ్ శంకర్ మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో యువ ఆటగాడు ప్రియమ్ గార్గ్ సబ్‌స్టిట్యూట్‌గా బరిలో దిగాడు. ఆ తర్వాతి ఓవర్లోనే అక్షర్ పటేల్ క్యాచ్ అందుకున్న గార్గ్.. 19వ ఓవర్లో అన్రిచ్ నోర్జే ఇచ్చిన క్యాచ్ అందుకున్నాడు. శ్రీవాత్స్ గోస్వామి, ప్రియమ్ గార్గ్ రూపంలో ఇద్దరు సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్లు బరిలో దిగడంతో.. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 13 మందితో ఆడింది.

IND vs AUS: భారత జట్టుకు ఎంపికయ్యాననే వార్తను నమ్మలేకపోయా.. ఇక నా లక్ష్యం అదే: వరుణ్‌

Story first published: Wednesday, October 28, 2020, 15:13 [IST]
Other articles published on Oct 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+