Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

SRH vs CSK: ఇది కదా ధోనీ కెప్టెన్సీ మ్యాజిక్.. విజయ్‌ శంకర్‌ను ఎలా బుట్టలో వేశాడంటే?!!

IPL 2020, SRH vs CSK: MS Dhoni Master Mind To Get Vijay Shankar Out

దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ 20 పరుగుల తేడాతో విజయం అద్భుత సాధించింది. వరుసగా రెండు ఓటముల తర్వాత ధోనీ సేన సూపర్ విక్టరీ ఖాతాలో వేసుకుంది. అంతేకాదు పాయింట్ల పట్టికలో ఓ స్థానంను మెరుగుపరుచుకుంది. 7 నుంచి 6వ స్థానంకు ఎగబాకింది. ఈ విజయంతో ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశాలు చెన్నై మెరుగుపరుచుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ మ్యాజిక్‌ కనిపించింది. గత కొన్ని మ్యాచులలో తేలిపోయిన మహీ.. విజయ్‌ శంకర్‌ కోసం ఫీల్డింగ్‌ సెట్‌ చేసి వికెట్‌ను తీయడంతో ఔరా అనిపించాడు.

శంకర్‌ కోసం​ ఫీల్డింగ్‌ సెట్

శంకర్‌ కోసం​ ఫీల్డింగ్‌ సెట్

డ్వేన్‌ బ్రేవో వేసిన 17 ఓవర్‌ తొలి బంతికి విజయ్ శంకర్‌ సిక్స్‌ కొట్టాడు. ఆ మరుసటి బంతికి సింగిల్‌ తీసిన శంకర్.. మళ్లీ నాలుగో బంతికి స్ట్రైకింగ్‌కు వచ్చాడు. అప్పుడు శంకర్‌ కోసం​ ఫీల్డింగ్‌ సెట్‌ చేశాడు ఎంఎస్ ధోనీ. బ్రేవో వద్దకు వెళ్లి అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌కు బంతి వేయమని చెప్పి దానికి తగ్గట్టు బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో ఫీల్డింగ్‌ సెట్‌ చేశాడు. అక్కడ ప్రపంచ బెస్ట్‌ ఫీల్డర్‌ రవీంద్ర జడేజాను ఉంచాడు. ఆఫ్ట్‌ స్టంప్‌ బయటకు బ్రేవో వేసిన బంతిని అనుకున్నట్లే విజయ్‌ శంకర్‌ హిట్‌ చేశాడు. అంతే అది గాల్లోకి లేవడం జడేజా దాన్ని క్యాచ్‌ అందుకోవడంతో శంకర్‌ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మహీ అనుకున్న వ్యూహం ఫలించింది.

కరణ్‌ శర్మతో బౌలింగ్

కరణ్‌ శర్మతో బౌలింగ్

18 ఓవర్‌ను కరణ్‌ శర్మతో బౌలింగ్‌ చేయించాడు చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ. ఆ సమయంలో పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌కు బౌలింగ్‌ ఇస్తారనుకున్నారంతా. ఎందుకంటే అప్పటికి ఒకే ఓవర్‌ వేశాడు అతడు. కానీ ధోనీ లెగ్‌ స్పిన్నర్‌ కరణ్‌ శర్మను బౌలింగ్‌కు దించాడు. ఒకే ఓవర్‌ వేసి ఐదు పరుగులే ఇచ్చిన ఠాకూర్‌ను వదిలేసి లెగ్‌ స్పిన్‌తో కరణ్‌ ఏమి మ్యాజిక్‌ చేస్తాడనిపించింది. ఆ ఓవర్‌ తొలి బంతికి ఫోర్‌ కొట్టాడు విలియమ్సన్‌. ఆ తర్వాత బంతికి లాంగాన్‌ ఫీల్డింగ్‌ సెట్‌ చేసిన మహీ. కరణ్‌ అవుట్‌సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌లో లెంగ్త్‌ బాల్‌ను వేశాడు. కేన్ స్లాగ్‌ స్వీప్ ఆడాడు. బంతి గాల్లో లేవడంతో ఠాకూర్‌ క్యాచ్‌ పట్టుకున్నాడు. ఇక్కడ కూడా మహీ వ్యూహం ఫలించింది.

మునపటి మహీని తలపించాడు

మునపటి మహీని తలపించాడు

కేన్‌ విలియమ్సన్‌-విజయ్‌ శంకర్‌ల జోడి ప్రమాదకరంగా మారకుండానే వారు వరుస ఓవర్లలోనే పెవిలియన్‌కు చేరడంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు గెలుపుపై ఆశలు చిగురించాయి. ప్రత్యేకంగా విజయ్‌ శంకర్‌-విలియమ్సన్‌లు స్లాగ్‌ ఓవర్‌లో ధాటిగా బ్యాటింగ్‌ చేస్తారని ముందే ఊహించిన ధోనీ.. అందుకు తగ్గట్టే బౌలింగ్‌ను ఇవ్వడమే కాకుండా ఫీల్డింగ్‌ సెట్‌ చేసిన విధానం మునపటి మహీని తలపించాడు. ఇక బ్యాటింగ్‌కు దిగి కూడా వేగంగా ఆడాడు. 13 బంతుల్లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాది 21 రన్స్ చేశాడు.

147 పరుగులకే పరిమితం

147 పరుగులకే పరిమితం

ఈ మ్యాచులో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సామ్‌ కరన్ ‌(31; 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), షేన్‌ వాట్సన్ ‌(42; 38 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), అంబటి రాయుడు (41; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్స్‌లు)లు రాణించారు. ఆపై ఛేదనలో హైదరాబాద్ 147 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. కేన్ విలియమ్సన్‌ (57; 39 బంతుల్లో 7×4) పోరాడినా ఫలితం లేపోయింది.

Delhi Capitals: రిషబ్‌ పంత్‌ స్థానంలో.. 23 ఏళ్ల దేశీయ హిట్టర్!!

Story first published: Wednesday, October 14, 2020, 11:50 [IST]
Other articles published on Oct 14, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+