
మరికొన్ని మ్యాచ్‌లకు పంత్ దూరం:
తొడ కండరాల నొప్పితో ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు దూరమైన రిషబ్ పంత్‌ది తీవ్రమైన గాయమేనని తెలుస్తోంది. 'రిషబ్ పంత్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కలిగిన ఆటగాడు కావడంతో అతడి గాయానికి సంబంధించిన స్కాన్ నివేదికలను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం.. బీసీసీఐకి పంపింది. అతడికి తొడ కండరాల్లో గ్రేడ్-1 చీలిక ఏర్పడింది' అని బీసీసీఐ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. పంత్ కనీసం 7-10 రోజులు టోర్నీకి దూరంగా ఉండనున్నాడు. ఇక పంత్ స్థానంలో గత ఆదివారం ముంబైతో మ్యాచ్‌కి అలెక్స్ క్యారీని కీపర్‌గా ఆడించినా అతను ఆశించిన మేర రాణించలేకపోయాడు.

9 బంతులు.. 14 పరుగులు:
తుది జట్టులో విదేశీ క్రికెటర్లు నలుగురే ఉండాలనే నిబంధన కారణంగా అలెక్స్ క్యారీకి చోటిచ్చేందుకు సిమ్రాన్ హిట్‌మెయర్‌ని ఢిల్లీ క్యాపిటల్స్ పక్కన పెట్టాల్సి వచ్చింది. దాంతో పంత్, హిట్‌మెయర్ రూపంలో ఇద్దరు పవర్ హిట్టర్ల సేవల్ని ఢిల్లీ కోల్పోయింది. ఈ ఇద్దరు లేకపోవడంతో ఢిల్లీ 5 వికెట్ల తేడాతో ముంబై చేతిలో ఓడిపోయింది. ఆ మ్యాచ్‌లో స్లాగ్ ఓవర్లలో క్రీజులోకి వచ్చిన క్యారీ 9 బంతులాడి కేవలం 14 పరుగులే చేశాడు. ఇందులో ఒక్క బౌండరీ కూడా లేకపోవడం విశేషం.

లలిత్ యాదవ్‌కి అవకాశం:
ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీకి టీ20ల్లో మెరుగైన రికార్డ్ లేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో 30 టీ20లు ఆడిన క్యారీ.. 176 రన్స్ మాత్రమే చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేదు. ఇక కొట్టిన సిక్సర్లు 6 మాత్రమే. దాంతో క్యారీని తుది జట్టులో ఆడించడం ప్రయోజనమేమీ లేదు. అతడు జట్టులో ఉంటే.. హిట్‌మెయర్ ఆడే అవకాశం లేదు. దాంతో రిషబ్ పంత్ స్థానంలో 23 ఏళ్ల దేశీయ హిట్టర్ లలిత్ యాదవ్‌ని ఆడించాలని ఢిల్లీ యాజమాన్యం, కెప్టెన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.

వేలంలో రూ. 20 లక్షలు:
ఢిల్లీకి చెందిన లలిత్ యాదవ్‌ని ఐపీఎల్ 2020 సీజన్ ఆటగాళ్ల వేలంలో రూ. 20 లక్షలకి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ అయిన లలిత్ యాదవ్.. జట్టులోకి వస్తే మిడిలార్డర్‌లోనూ సమతూకం వస్తుందని ఢిల్లీ టీమ్ భావిస్తోంది. అంతేకాక కీపింగ్ బాధ్యతలు కూడా అప్పగించాలని చూస్తోంది. క్యారీ స్థానంలో యాదవ్ ఆడితే.. హిట్‌మెయర్ ఆడేందుకు మార్గం సుగమమవుతుంది. రాజస్థాన్ రాయల్స్‌తో ఈరోజు రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఈ మ్యాచులో యాదవ్ ఆడుతాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications












