For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

SRH vs CSK: చెన్నైదే బ్యాటింగ్.. ఇరు జట్లలో మార్పులు

Sunrisers Hyderabad vs Chennai Super Kings

దుబాయ్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. లీగ్‌లో తొలిసారి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నామని కెప్టెన్ ధోనీ తెలిపాడు. పిచ్ పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామన్నాడు. జట్టులో ఓ మార్పు చోటు చేసుకుందని, జగదీషన్ స్థానంలో పియూష్ చావ్లాను తీసుకున్నామన్నాడు.

ఇక హైదరాబాద్ జట్టులో కూడా ఓ మార్పు చోటు చేసుకుంది. అభిషేక్ శర్మ స్థానంలో నదీమ్‌ను జట్టులోకి తీసుకున్నారు. టైటిల్‌‌ ఫేవరెట్‌‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌‌కింగ్స్‌‌ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఆడిన 7 మ్యాచ్‌‌ల్లో రెండింటిలో గెలిచి పాయింట్స్ టేబుల్‌‌లో ఆఖరి నుంచి రెండో స్థానం‌లో నిలిచిన ధోనీసేన ఇప్పుడు చావోరేవో పరిస్థితిలో పడింది. ప్లే ఆఫ్‌‌ ఆశలు సజీవంగా ఉండాలంటే ప్రతి మ్యాచ్‌‌ గెలవాల్సిన స్థితిని తెచ్చుకుంది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో అనూహ్య పరాజయంతో ఖంగుతిన్న హైదరాబాద్‌కు కూడా గెలుపు అనివార్యమైంది.

ఈ సీజన్‌‌లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ అద్భుత విజయాన్నందుకుంది. యువ ఆటగాళ్ల ప్రతిభతో గెలుపొందింది. ఆ ఓటమికి చెన్నై ప్రతీకారం తీర్చుకుంటుందో లేదో చూడాలి! ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 13 మ్యాచ్ లు జరగ్గా చెన్నై 9-4తో లీడ్ లో ఉంది.

తుది జట్లు

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో, మనీష్ పాండే, విలియమ్సన్, ప్రియమ్ గార్గ్, నదీమ్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, టీ నటరాజన్, ఖలీల్ అహ్మద్

చెన్నై సూపర్ కింగ్స్: షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లెసిస్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ(కెప్టెన్, కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, సామ్ కరన్, శార్దుల్ ఠాకుర్, దీపక్ చాహర్, కరన్ శర్మ, పియూష్ చావ్లా

Story first published: Tuesday, October 13, 2020, 19:09 [IST]
Other articles published on Oct 13, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+