SRH vs CSK: సన్‌రైజర్స్ ఓటమికి ఆ మూడు తప్పిదాలే కారణం!!

హైదరాబాద్: మంగళవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. బౌలర్లు బాగానే రాణించినా.. బ్యాట్స్‌మెన్ వైఫల్యం కారణంగా సన్‌రైజర్స్ మరో ఓటమిని ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిన సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచే అవకాశాన్ని కూడా చేజార్చుకుని.. ప్రస్తుతం ఆరు పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. మిగిలిన అన్ని మ్యాచులలో గెలిస్తేనే.. సన్‌రైజర్స్ జట్టుకు అధికారిక బెర్త్ దక్కుతుంది. ఒకటి రెండు ఓడిపోతే మాత్రం మిగతా జట్ల సమీకరణాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ చేసిన తప్పిదాలను ఓసారి చూద్దాం.

అదనపు బౌలర్ కాకుండా
దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. అక్కడ పరుగులు చేయడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో సన్‌రైజర్స్ అదననపు బ్యాట్స్‌మెన్‌ను తీసుకోవాల్సింది. కానీ స్పిన్నర్ షాబాజ్ నదీమ్‌ను తుది జట్టులోకి తీసుకుంది. నదీమ్ బాగానే బౌలింగ్ చేసినా.. అభిషేక్ శర్మను తీసుకొని ఉండాల్సింది. అభిషేక్ ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ కాబట్టి.. చెన్నై లెగ్ స్పిన్నర్లను సమర్ధంగా ఎదుర్కొనేవాడు. లక్ష్య ఛేదనలో కీలక సమయంలో అతడు చేసే పరుగులు జట్టుకు ఉపయోగపడేవే.

యార్కర్లు వేయడంలో విఫలం
గాయం కారణంగా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ 2020కి దూరం కావడంతో సన్‌రైజర్స్ బౌలింగ్ బలహీనపడింది. డెత్ ఓవర్లు వేసే బాధ్యత టీ నటరాజన్, ఖలీల్ అహ్మద్‌పై పడింది. గత మ్యాచ్‌ల్లో సరైన ప్రాంతాల్లో బంతులు విసిరిన ఈ పేసర్లు.. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో విఫలమయ్యారు. డెత్ ఓవర్లలో యార్కర్ బంతులు సంధించలేకపోయారు. దీంతో చివరి 2 ఓవర్లలో చెన్నై 29 పరుగులు చేసింది. ఈ పరుగులే సన్‌రైజర్స్ ఓటమికి కారణమయ్యాయి.

సరైన ఆరంభం లేదు
ఐపీఎల్ టోర్నీ జరుగుతున్నా కొద్ది యూఏఈ పిచ్‌లు నెమ్మదిస్తున్నాయి. ఛేదనలో బ్యాట్స్‌మన్ పరుగులు చేయడానికి ఇబ్బందిపడుతున్నారు. లీగ్ ఆరంభంలో టాస్ గెలిచిన జట్లు బౌలింగ్ ఎంచుకోగా.. ఇప్పుడు బ్యాటింగ్ తీసుకుంటున్నాయి. నిన్న టాస్ గెలిచిన చెన్నై ముందుగా బ్యాటింగ్ ఆ జట్టుకు కలిసొచ్చింది. ఛేదనలో బ్యాటింగ్ స్లో అవుతుందని తెలిసినా.. సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. పవర్ ప్లేను సద్వినియోగం చేసుకోలేకపోయారు. భారీ హిట్టర్లు ఉన్నా కూడా ఆరంభం దక్కలేదు. దీంతో మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరిగి వికెట్లు చేజార్చుకున్నారు.
'జట్టు గెలుపే ముఖ్యం.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లకు విలువ ఇవ్వను'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications