అందుకే ఓడాం.. దాని గురించి ఒకసారి ఆలోచించాలి: శ్రేయస్ అయ్యర్

దుబాయ్: పిచ్‌ను అర్థం చేసుకోకపోవడం, స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చకపోవడంతోనే ముంబై ఇండియన్స్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నామని ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. శనివారం ఏక పక్షంగా సాగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్లతో ఢిల్లీని చిత్తు చేసిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లో దారుణంగా విఫలమైన ఢిల్లీ వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడి ప్లే ఆఫ్స్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన అయ్యర్.. తమ ఆటలో చాలా లోపాలున్నాయని అంగీకరించాడు. జట్టు మార్పుల గురించి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నాడు.

బిట్స్ అండ్ పీసెస్‌గా..
‘మేం పిచ్‌ను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యాం. ఆరంభం నుంచే స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాం. పవర్ ప్లేలోనే వికెట్లను చేజార్చకోవడంతోనే వెనకపడ్డాం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మాలోని కొంత మంది కీలక భాగస్వామ్యాలను నెలకొల్పాల్సింది. కానీ అది బిట్స్ అండ్ పీసెస్‌గా మారింది. మా ఆటలో చాలా లోపాలున్నాయి. కానీ మనల్ని మనం నమ్ముకోవాలి. దృడంగా, సానుకూలంగా ఉండాలి.

కాంబినేషన్స్‌పై ఆలోచించాలి..
పిచ్ ఎలా ఉంటుందో ముందే ఊహించడం కష్టం. కానీ ఓపెనర్లు కుదురుకొని మంచి ఆరంభాన్ని ఇవ్వడం చాలా ముఖ్యం. అలా మూమెంటమ్ అందుకున్న తర్వాత ఇన్నింగ్స్ నిర్మించవచ్చు. ఇలాంటి పిచ్‌పై 150 నుంచి 160 పరుగులు చేస్తే సరిపోతుందనేది నా అభిప్రాయం. మా జట్టు మార్పుల గురించి ఒకసారి ఆలోచించాలి. నిర్భయంగా ఆడాల్సిన అవసరం ఉంది. ఎక్కువగా ఆలోచించకుండా సింపుల్‌గా ముందుకు సాగుతాం. తదుపరి మ్యాచ్ ఇరు జట్లకు చావోరేవో మ్యాచే. అయితే ఇది ఈ రాత్రి ఆర్‌సీబీకి వచ్చే ఫలితంపై ఆధారపడి ఉంటుంది.'అని అయ్యర్ చెప్పుకొచ్చాడు.

ఇ'స్మార్ట్' ఇషాన్
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 110 రన్స్ చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(25), రిషభ్ పంత్ (21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. జస్‌ప్రీత్ బుమ్రా (3/17), ట్రెంట్ బౌల్ట్ (3/21) ఢిల్లీ పతనాన్ని శాసించారు. అనంతరం ముంబై ఇండియన్స్ 14.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 111 పరుగులు చేసి సునాయంగా గెలుపొందింది.
ఇషాన్ కిషన్(47 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 నాటౌట్) ఇస్మార్ట్ ఇన్నింగ్స్‌కు తోడుగా డికాక్(26), సూర్యకుమార్ యాదవ్ (12 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో నోర్జ్‌కు ఒక వికెట్ దక్కింది. ఈ దారుణ ఓటమితో ఢిల్లీ తమ ప్లే ఆఫ్స్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది. తదుపరి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications