KXIP vs DC: వరుసగా రెండు సెంచరీలు.. ఐపీఎల్ చరిత్రలో ధావన్ సరికొత్త రికార్డు!!

దుబాయ్: ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ పరుగుల వరద పారిస్తున్నాడు. హాఫ్ సెంచరీలు, సెంచరీలు బాదేస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. షార్జా వేదికగా గత శనివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అజేయ శతకంతో ఢిల్లీని గెలిపించిన ధావన్.. తాజాగా మరో సెంచరీ బాదాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో ధావన్ (106 నాటౌట్: 61 బంతుల్లో 12x4, 3x6) అజేయ సెంచరీ చేశాడు. దీంతో ఐపీఎల్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా ధావన్ రికార్డుల్లోకి ఎక్కాడు.

కోహ్లీ@1:
13 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ బ్యాట్స్‌మెన్ వరుస మ్యాచ్‌ల్లో సెంచరీ బాదడం ఇదే తొలిసారి. ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఐపీఎల్‌లో రెండు సెంచరీలు చేశాడు. ఆ రెండు కూడా ఈ సీజన్‌లో చేశాడు. అదికూడా వరుసగా రెండు మ్యాచుల్లో చేయడం విశేషం. ఒకే సీజన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ (4) అగ్ర స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 2016లో నాలుగు శతకాలు బాదాడు. 2011లో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ సీనియర్ ఓపెనర్ క్రిస్ గేల్ రెండు సెంచరీలు చేసి రెండో స్థానంలో ఉన్నాడు. అప్పుడు గేల్ బెంగళూరు తరపున ఆడాడు.

అషీమ్ ఆమ్లా@3:
2017లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ అషీమ్ ఆమ్లా ఒకే సీజన్‌లో రెండు శతకాలు చేసి మూడో స్థానంలో ఉన్నాడు. 2018లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ షేన్ వాట్సన్ కూడా రెండు శతకాలు చేశాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఒకే సీజన్‌లో రెండు సెంచరీలు బాదాడు. 2008 నుంచి ఐపీఎల్ ఆడుతున్న ధావన్.. 169 మ్యాచులలో ఐదు వేలకు పైగా రన్స్ చేశాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి. 39 అర్ధ శతకాలు కూడా బాదాడు.

ధావన్ ఒంటరి పోరాటం:
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న శిఖర్ ధావన్ (106) మరో అద్భుత ప్రదర్శన చేశాడు. వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ తన బ్యాట్ పవర్ ఏమిటో చూపించాడు. ధావన్‌కు శ్రేయస్ అయ్యర్ (14), రిషబ్ పంత్ (14) కాస్త సహకారం అందించారు. మరో ఎండ్‌లో బ్యాట్స్‌మెన్ పెద్దగా అండగా నిలబడకపోయినా పంజాబ్ బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. ధావన్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ పరుగులు రాబట్టేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. పంజాబ్ బౌలర్లలో షమీ రెండు వికెట్లు తీయగా.. మాక్స్‌వెల్, నీషమ్, మురుగన్ అశ్విన్ తలో వికెట్ తీశారు.
KXIP vs DC: శిఖర్ ధావన్ 'బ్యాక్ టు బ్యాక్' సెంచరీ.. పంజాబ్ లక్ష్యం 165
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications