For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KXIP vs DC: శిఖర్ ధావన్ 'బ్యాక్ టు బ్యాక్' సెంచరీ.. పంజాబ్ లక్ష్యం 165

IPL 2020, KXIP vs DC: Shikhar Dhawan scores 2nd successive 100, Punjab target 165

దుబాయ్:‌ దుబాయ్:‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరాడే స్కోర్ చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ 57 బంతుల్లో సెంచరీ చేయడంతో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 రన్స్ చేసి.. పంజాబ్ ముందు 165 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ధావన్ (106 నాటౌట్: 61 బంతుల్లో 12x4, 3x6) సెంచరీతో చెలరేగినా.. మిగతా బ్యాట్స్‌మన్‌ చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (14).. హిట్టర్లు రిషబ్ పంత్ (14), షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ (10) పూర్తిగా విఫలమయ్యారు. పంజాబ్ బౌలర్లు డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేయలేకపోయింది. పంజాబ్ పేసర్ మొహమ్మద్ షమీ తన కోటా 4 ఓవర్లలో రెండు వికెట్లు తీసి 28 రన్స్ మాత్రమే ఇచ్చాడు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా(7) త్వరగానే ఔట్ అయ్యాడు. జేమ్స్ నీషమ్‌ బౌలింగ్‌లో పృథ్వీ షా క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరుణంలో శిఖర్‌కు కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ జత కలిశాడు. ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ధావన్ దూకుడుగా ఆడగా.. అయ్యర్‌ నెమ్మదిగా ఆడాడు. వీరిద్దరూ 48 పరుగులు జత చేసిన తర్వాత అయ్యర్ ‌(14) రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. మురుగన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి అయ్యర్‌ ఔటయ్యాడు.

అనంతరం రిషభ్‌ పంత్‌ (14) కూడా నిరాశపరిచాడు. ఓ వైపు ఢిల్లీ టాపార్డర్‌ వికెట్లను చేజార్చుకున్నా.. శిఖర్ ధావన్‌ మాత్రం బాధ్యతాయుతంగా ఆడాడు. వరుసగా రెండో మ్యాచులో కూడా ధావన్‌ అత్యంత నిలకడగా ఆడాడు. ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. 57 బంతుల్లో12 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీని సాధించాడు. ఇది శిఖర్‌కు ఓవరాల్‌ ఐపీఎల్‌లో రెండో సెంచరీ కాగా, అది కూడా వరుసగా సాధించడం విశేషం. ఫలితంగా ఐపీఎల్‌ చరిత్రలో వరుసగా రెండో సెంచరీలు సాధించిన తొలి ఆటగాడుగా ధావన్‌ రికార్డు నెలకొల్పాడు.

హిట్టర్లు మార్కస్ స్టోయినిస్ ‌(9), షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ ‌(10; 6 బంతుల్లో 1 సిక్స్‌)ల నుంచి ఆశించిన మెరుపులు రాకపోవడంతో ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లు డెత్ ఓవర్లలో బాగా బౌలింగ్ చేయడంతో ఢిల్లీ భారీ స్కోర్ చేయలేకపోయింది. పంజాబ్‌ బౌలర్లలో షమీ రెండు వికెట్లు సాధించగా.. నీషమ్‌, మురుగన్‌ అశ్విన్‌, మ్యాక్స్‌వెల్‌లు తలో వికెట్‌ తీశారు.

Story first published: Tuesday, October 20, 2020, 21:28 [IST]
Other articles published on Oct 20, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+