
షార్జా: ఐపీఎల్ 2020 సీజన్‌లో ముంబై ఇండియన్స్ దూసుకెళ్తుంది. చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన ఆ జట్టు 10 వికెట్లతో అద్భుత విజయాన్నందుకుంది. ముందుగా సూపర్ బౌలింగ్‌తో చెన్నైని కట్టడి చేసిన ముంబై తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగింది. అయితే ఈ మ్యాచ్ ఫలితంపై ఆ జట్టు బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ సంతోషం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా తమ బౌలర్ల పవర్‌ప్లే పెర్ఫామెన్స్‌ను కొనియాడాడు. ఇక బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ధాటికి చెన్నై సూపర్ కింగ్స్ 3 ఓవర్లలో 3 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ విషయాన్నే ప్రస్తావించిన షేన్ బాండ్ టీ20 క్రికెట్ చరిత్రలోనే తాను ఇలాంటి స్కోర్ బోర్డును కనివిని ఏరుగలేదన్నాడు. మ్యాచ్ అనంతరం ఈ ముంబై బౌలింగ్ కోచ్ మాట్లాడిన వీడియోను ఆ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
'ఇది ముంబై పర్‌ఫెక్ట్ పెర్ఫామెన్స్. మూడు ఓవర్లలో 4 పరుగులకు 5 వికెట్లు( వాస్తవానికి 3 ఓవర్లలో 3 పరుగులకు 4 వికెట్లు) నేనింత వరకు చూడలేదు. ఇదంతా బుమ్రా-బౌల్ట్ కాంబినేషన్‌తోనే అని కాదు. క్వాలిటీ బౌలింగ్ ఫలితం. ముఖ్యంగా తొలి 4 ఓవర్లలో ముంబై బౌలింగ్ అసాధారణం. ఇక వరల్డ్ క్లాస్ పేసర్లు ఉండటం మా అదృష్టం. ఈ ఫలితం అద్భుతం. ఇషాన్ బ్యాటింగ్ అసాధారణం. అతను బంతిని హిట్ చేసే విధానం సూపర్బ్. గత మూడు వారాలుగా అతను నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. డికాక్-ఇషాన్ బ్రిలియంట్ పార్ట్‌నర్ షిప్‌తో 13ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించాం. ఇద్దరి ఆట అద్భుతం'అని షేన్ బాండ్ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ట్రెంట్ బౌల్ట్(4/18), జస్ ప్రీత్ బుమ్రా(2/25), రాహుల్ చాహర్ (2/22) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 114 రన్స్ చేసింది. సామకరన్ (42 బంతుల్లో 4 ఫోర్, 2 సిక్స్‌లతో 52) మినహా అంతా దారుణంగా విఫలమయ్యారు. ధోనీ(16 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్‌తో 16), జడేజా(7), ఫాఫ్(1) తీవ్రంగా నిరాశపరిచారు. అనంతరం చెన్నై ఓపెనర్లు ఇషాన్ కిషన్(37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 68 నాటౌట్), క్వింటన్ డికాక్(37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో 12.2 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 116 పరుగులు చేసి ఘనవిజయాన్నందుకుంది.