
గైక్వాడ్‌కు కరోనా:
చెన్నై సూపర్ కింగ్స్ యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కరోనా వైరస్ బారినపడినట్లు సమాచారం. దీపక్ చాహర్ తర్వాత కరోనా సోకిన రెండవ ప్లేయర్ గైక్వాడే. చెన్నై జట్టు సభ్యులకు కరోనా సోకడంతో నాల్గొసారి అందరికీ కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. దాంట్లో రుతురాజ్ గైక్వాడ్‌కు పాజిటివ్‌గా తేలినట్లు తెలుస్తోంది. దీంతో సీఎస్‌కేలో కరోనా బాధితుల సంఖ్య 12కు చేరింది. చెన్నై జట్టులో కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ నెల 21 నుంచి యూఏఈలో ఆ జట్టు క్వారంటైన్‌లో ఉన్నా.. ఆటగాళ్లు నిబంధనలు అతిక్రమించి సామాజిక దూరం రూల్‌ని బ్రేక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

2019 వేలంలో:
పుణెకి చెందిన ఈ 23 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్ మహారాష్ట్ర తరఫున ఆడుతున్నాడు. 2018-19 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో రుతురాజ్‌ని ఐపీఎల్ 2019 ఆటగాళ్ల వేలంలో రూ. 20 లక్షలకి చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అప్పటి నుంచి జట్టులో అతను కొనసాగుతున్నాడు. అయితే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2016-17 సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచిన రుతురాజ్.. అప్పటి నుంచి దేశవాళీలో మెరుపులు మెరిపిస్తున్నాడు.

14 రోజుల ఐసోలేషన్:
ఇప్పటికే సీఎస్‌కే ఫ్రాంఛైజీలో దీపక్ చాహర్‌తో పాటు కనీసం 10 మంది సహాయ సిబ్బంది కూడా ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా రుతురాజ్ గైక్వాడ్ కూడా ఐసోలేషన్‌లోకి వెళ్ళిపోయాడు. బీసీసీఐ ఎస్‌ఓపీ ప్రకారం కరోనా వైరస్ సోకిన వాళ్లు 14 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలి. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ధోనీసేన ఆలస్యంగా ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది. చెన్నై ఆటగాళ్లను సెప్టెంబర్ 1 నుంచి మాత్రమే మైదానంలో సాధన కోసం అనుమతిస్తారు.

ఐపీఎల్ 2020పై సందిగ్ధత:
సీఎస్‌కే స్టార్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా ఐపీఎల్ 2020 నుంచి తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 సీజన్ మొత్తానికి రైనా దూరమైనట్లు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ సీఈవో కాశీ విశ్వనాథన్ ప్రకటించాడు. ఒకవైపు రైనా దూరమవడం, మరోవైపు ఆటగాళ్లు వైరస్ బారిన పడుతుండడంతో చెన్నై ప్రాంచైజీ తల పట్టుకుంది. ఇప్పుడు ఐపీఎల్ 2020 సీజన్‌పైనా సందిగ్ధత నెలకొంది.


Click it and Unblock the Notifications

ద్రోణాచార్య వార్డు తీసుకునే ముందే.. గుండెపోటుతో రాయ్ మృతి!!










