Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RR vs RCB: చేలరేగిన ఊతప్ప, స్మిత్.. ఆర్‌సీబీకి టఫ్ టార్గెట్!

IPL 2020, RR vs RCB: Steve Smith, Robin Uthappa propel Rajasthan to 177 for 6

షార్జా: రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 178 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. స్టీవ్ స్మిత్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 57 ), రాబిన్ ఊతప్ప (22 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 41) రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 రన్స్ చేసింది. చివర్లో స్మిత్, రాహుల్ తెవాటియా(11 బంతుల్లో 1 ఫోర్, సిక్స్‌తో 19 నాటౌట్) ధాటిగా ఆడటంతో రాజస్థాన్ భారీ స్కోర్ చేసింది. ఇక ఆర్‌సీబీ బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీయగా క్రిస్ మోరిస్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్‌కు శుభారంభం దక్కింది. రాబిన్ ఊతప్ప, బెన్ స్టోక్స్(15)లను ఓపెనర్లుగా పంపి రాజస్థాన్ చేసిన ప్రయోగం ఫలించింది. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన ఊతప్ప తన వరుస వైఫల్యాలకు చెక్ పెడుతూ చెలరేగాడు. సుంధర్ వేసిన మూడో ఓవర్‌లో నాలుగు ఫోర్లు, ఉడానా బౌలింగ్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో విధ్వంసం సృష్టించాడు.

మోర్రిస్ వేసి ఐదో ఓవర్‌లో స్టోక్స్ ఔటవ్వడంతో తొలి వికెట్‌కు నమోదైన 50 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఇక స్టోక్స్ ఔటైనా ఊతప్ప దూకుడు ఆగలేదు. వరుస బౌండరీలతో ధాటిగా ఆడాడు. అదే జోరులో చాహల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఊతప్ప ఔటవ్వగా.. ఆ మరుసటి బంతికే శాంసన్ కూడా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో జోస్ బట్లర్(24), స్మిత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. బట్లర్ ఔటైనా.. తెవాటియా సాయంతో స్మిత్ చెలరేగాడు. బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఆఖరి ఓవర్‌లో మోరిస్ స్మిత్, ఆర్చర్‌ను ఔట్ చేసి కొన్ని పరుగులను నియంత్రించాడు.

Story first published: Saturday, October 17, 2020, 17:30 [IST]
Other articles published on Oct 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+