
షార్జా: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నామని రాజస్థాన్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తెలిపాడు. వరుణ్ ఆరుణ్, ఆండ్రూ టై జట్టులోకి రాగా.. అంకిత్ రాజ్ పుత్, టామ్ కరన్ బెంచ్‌కు పరిమితమయ్యారని తెలిపాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతుంది.
ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఐదు మ్యాచ్‌లాడిన రాజస్థాన్ రెండింటిలోనే గెలిచింది. ఈ రెండూ షార్జాలోనే కావడం గమనార్హం. దుబాయ్, అబుదాబిల్లో జరిగిన మ్యాచ్‌ల్లో రాయల్స్ ప్లేయర్లు అట్టర్ ఫ్లాపయ్యారు. దీంతో అచ్చొచ్చిన మైదానంలో అదరగొట్టేందుకు రాజస్థాన్ ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. కానీ అది అనుకున్నంత సులువుకాదు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని ఢిల్లీ అన్ని విభాగాల్లో బలంగా ఉంది. ఆల్‌రౌండ్ షోతో అదరగొడుతూ ఇప్పటికే ఐదింటిలో నాలుగు గెలిచి టేబుల్లో రెండో స్థానంలో ఉంది.
అదే ఊపును కొనసాగిస్తూ హ్యాట్రిక్ విజయాన్నందుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 20 సార్లు తలపడగా.. 11-9తో రాజస్థాన్ లీడ్‌లో ఉంది. అయితే గత సీజన్‌లో జరిగిన రెండూ మ్యాచ్‌ల్లో రాజస్థాన్‌ను ఢిల్లీ ఓడించింది. ఇక చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఢిల్లీ మూడు గెలవగా.. రాజస్థాన్ ఒకటి గెలిచింది. అయితే షార్జా వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లో రాజస్థాన్ గెలవడం ఆ జట్టుకు సానుకూలంశం కాగా.. ఈ మైదనాంలో ఆడిన ఏకైక మ్యాచ్‌లో కోల్‌కతాను ఢిల్లీ ఓడించింది. మరి జెట్ స్పీడ్‌లా దూసుకెళ్తున్న ఢిల్లీకి రాజస్థాన్ బ్రేక్‌లు వేస్తుందా? లేక గత మ్యాచ్‌ల్లోలానే చేతులెత్తేస్తుందో చూడాలి!
తుది జట్లు:
రాజస్థాన్: యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మహిపాల్ లోమ్‌రార్, రాహుల్ తెవాటియా, శ్రేయస్ గోపాల్, ఆండ్రూ టై, జోఫ్రా ఆర్చర్, కార్తీక్ త్యాగి, వరుణ్ ఆరోన్
ఢిల్లీ: పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషభ్ పంత్(కీపర్), షిమ్రాన్ హెట్‌మైర్, మార్కస్ స్టోయినిస్, అక్సర్ పటేల్, అశ్విన్, హర్షల్ పటేల్, అన్రిచ్ నోర్జ్, కగిసో రబడా