Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వికెట్ తీసిన ఆనందంలో రియాన్ పరాగ్‌తో బిహూ డ్యాన్స్ చేసిన జోఫ్రా ఆర్చర్ (వీడియో)

IPL 2020, RR vs DC: Jofra Archer celebrates Prithvi Shaw wicket by doing Bihu dance with Riyan Parag
IPL 2020 : Jofra Archer Celebrates Prithvi Shaw Wicket By Doing Bihu Dance || Oneindia Telugu

దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మైదానంలో చిందేశాడు. వికెట్ తీసిన ఆనందంలో సహచర యువ ఆటగాడు రియాన్ పరాగ్‌తో బిహూ డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. ఢిల్లీ ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్‌కే పృథ్వీ షాను క్లీన్ బౌల్డ్ చేసిన జోఫ్రా ఆర్చర్.. రాజస్థాన్‌కు మంచి శుభారంభాన్ని అందించాడు. ఈ సూపర్ వికెట్ తీసిన ఆనందాన్ని ఆర్చర్.. రియాన్‌తో కలిసి ఆస్వాదించాడు.

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో టాపార్డర్ విఫలమైన వేళ.. సహచర ఆటగాడు రాహల్ తెవాటియాతో కలిసి రియాన్ పరాగ్ జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. క్లిష్ట పరిస్థితుల్లో 42 పరుగులతో నాటౌట్‌గా నిలిచి విన్నింగ్ షాట్‌‌గా సిక్స్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. ఆ వెంటనే తనదైన సెలెబ్రేషన్‌తో ఈ యువ ఆటగాడు అందరి దృష్టిని ఆకర్షించాడు. అస్సామి బిహూ డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకున్నాడు.

ఈ డ్యాన్స్‌కు ముగ్దుడైన ఆర్చర్.. తాజా మ్యాచ్‌లో కుర్రాడితో కలిసి మరీ చిందేశాడు. బిహూ డ్యాన్స్ అస్సాం జాన‌ప‌ద నృత్యం కాగా.. కొత్త సంవ‌త్స‌రానికి వెల్ క‌మ్ చెప్పే క్ర‌మంలో అక్క‌డి వాళ్లు చేసే ప్ర‌త్యేక డ్యాన్స్ ఇది. ఇక అస్సాం కల్చర్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన రియాన్ పరాగ్‌ను ఆ రాష్ట్ర ప్రజలు కొనియాడుతున్నారు.

ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఢిల్లీ 13 పరుగులతో అద్భుత విజయాన్నందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 161 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 57), శ్రేయస్ అయ్యర్(43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా.. జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు పడగొట్టాడు. కార్తీక్ త్యాగి, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీశారు.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 148 పరుగులు మాత్రమే చేసింది. బెన్ స్టోక్స్(35 బంతుల్లో 6 ఫోర్లతో 41), రాబిన్ ఊతప్ప(27 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో 32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఢిల్లీ బౌలర్లలో తుషార్, నోర్జ్ రెండేసి వికెట్లు తీయగా.. రబడా, అశ్విన్, అక్సర్ పటేల్ తలో వికెట్ తీశారు.

Story first published: Thursday, October 15, 2020, 0:17 [IST]
Other articles published on Oct 15, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+