
బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో తొలిసారి ఓ మహిళా పనిచేయబోతోంది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తమ సహాయక సిబ్బందిలో ఒక మహిళను తీసుకుంది. బెంగళూరు ఫ్రాంఛైజీ మసాజ్ థెరపిస్ట్‌గా నవనీత గౌతమ్ ఎంపికైంది. ఐపీఎల్ చరిత్రలో ఇలా ఓ మహిళకు అవకాశం ఇవ్వడం ఇదే తొలిసారి. ఇక ఐపీఎల్‌లో ఒక మహిళని సహాయక బృందంలో చేర్చుకున్న తొలి జట్టుగా బెంగళూరు రికార్డుల్లోకి ఎక్కింది. భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే.
Karva Chauth Special: అయేషా.. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా: ధావన్
గురువారం రాత్రి బెంగళూరు జట్టు తమ అధికారిక ట్విటర్‌లో నవనీత గౌతమ్‌ను మసాజ్ థెరపిస్ట్‌గా నియమించుకున్నట్టు వెల్లడించింది. 'ఐపీఎల్ 13వ సీజన్‌కు నవనీత గౌతమ్ అనే మసాజ్ థెరపిస్ట్‌ను నియమించుకున్నాం. ఆటగాళ్లకు అవసరమైన ఫిజియో సంబంధిత అంశాలను పర్యవేక్షిస్తుంది' అని ఆర్సీబీ ట్వీట్ చేసింది. ఆర్‌సీబీ హెడ్ ఫిజియోథెరపిస్ట్ ఇవాన్ స్పీచ్‌లీ, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ శంకర్ బసులతో కలిసి నవనీత పని చేస్తుంది.
ఫిజియో ప్రతిభావంతురాలు నవనీతను జట్టులోకి తీసుకోవడం పట్ల గర్వపడుతున్నా అని బెంగళూరు జట్టు చైర్మన్ సంజీవ్ చురీవాలా పేర్కొన్నాడు. 'మహిళలు అన్నింటిలో రాణిస్తున్నారు. ఆటలో మహిళా ప్రధాన్యాన్ని గుర్తించి సహాయక బృందాల్లోనూ వారికి అవకాశమివ్వడం చాలా ముఖ్యం. అన్ని క్రీడా విభాగాల్లో మహిళల భాగస్వామ్యంతో సాధిస్తున్న విజయాలే నవ్‌నీతా ఎంపికకు కారణం' అని అన్నారు.
ఆటగాళ్ల ఫిట్‌నెస్ కోసం ప్రత్యేక నైపుణ్య సాధనాలు చేయించడం, మోటివేషన్ కలిగించడంతో పాటు శారీరక గాయాలకు సంబంధించిన చికిత్సలను నవనీత చూసుకుంటుంది. గత ఆగస్టులో ఆర్సీబీ మైక్ హెస్సన్‌ను తప్పించి సైమన్ కటిచ్‌ను కొత్త హెడ్ కోచ్‌గా నియమించింది. 12 వరుస సీజన్లలో ఆర్సీబీ అత్యుత్తమ ఆటగాళ్లను కలిగి ఉన్నప్పటికీ.. ఐపీఎల్ ట్రోఫీని గెలవడంలో మాత్రం విఫలమైంది. ప్రతి సీజన్‌లలో ఆటగాళ్లను మార్చుతున్నా.. ఆర్సీబీ రాత మాత్రం మారట్లేదు.