Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Karva Chauth Special: అయేషా.. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా: ధావన్

Shikar Dhawan, Virat Kohli Celebrate Karva Chauth with his Wifes Ayesha Mukherjee and Anushka Sharma

ముంబై: దేశ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో కర్వాచౌత్‌ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. కర్వాచౌత్‌ అంటే.. భర్తలను భార్యలు పూజించే రోజు. ఏడాదిలో దీపావళికి ముందు వచ్చే కర్వాచౌత్‌ పండగను మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఎంతోమంది ప్రముఖులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. బాలీవుడ్ హీరోయిన్, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ కర్వాచౌత్‌ వేడుకలను ఘనంగా జరువుకుంది. ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ భార్య అయేషా.. పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మల సతీమణులు కూడా వేడుకలు చేసుకున్నారు.

నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా:

ప్రస్తుతం సోషల్ మీడియాలో కర్వాచౌత్‌ వేడుకలకు సంబందించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. పలువురు టీమిండియా క్రికెటర్లు తమ సతీమణులతో కలిసి గురువారం కర్వాచౌత్‌ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తమ సతీమణులతో కలిసి దిగిన ఫొటోలను తమ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో ధావన్‌ తన భార్య అయేషాకు శుభాకాంక్షలు తెలిపాడు. 'నువ్వు దూరంగా ఉన్నా.. నా మనసుకి దగ్గరగానే ఉంటావు. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా' అంటూ రాసుకొచ్చాడు.

ఎవరైతే కలిసి ఉపవాసం ఉంటారో:

విరాట్‌ కోహ్లీ ట్విటర్‌లో అనుష్క శర్మతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశాడు. 'ఎవరైతే కలిసి ఉపవాసం ఉంటారో.. వారు కలిసి నవ్వుకుంటారు' అని కాప్షన్ పెట్టాడు. అనుష్క కూడా ఓ ఫొటో ఇన్‌స్టాలో పోస్టు చేసి.. కోహ్లీతో పాటు అభిమానులకు శుభాకాంక్షలు తెలిపింది. మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం తన సతీమణితో కలిసి దిగిన ఫొటో పంచుకున్నాడు. 'ప్రేమ, గౌరవం అద్భుతం' అని రాసుకొచ్చాడు. భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మ సైతం తమ సతీమణులతో దిగిన ఫొటోలను పోస్టు చేసి శుభాకాంక్షలు తెలిపారు.

లాస్ ఏంజెల్స్‌లో ప్రియాంక వేడుకలు:

కర్వాచౌత్‌ వేడుకలను హీరోయిన్లు ఘనంగా జరుపుకున్నారు. ఐశ్వర్యరాయ్, సోనాలి బింద్రే, రవీనా టాండన్, శిల్పా శెట్టి, పద్మిని కోల్హాపురే, భావన పాండేలు వేడుకలో పాల్గొన్నారు. ప్రియాంక చోప్రా కూడా కర్వాచౌత్‌ వేడుకని జరుపుకుంది. పెళ్లి తర్వాత వీరికి ఇది తొలి కకర్వాచౌత్‌ కాగా.. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన జోనాస్ కాన్సర్ట్‌లో ఈ వేడుక జరుపుకుంది.

కర్వాచౌత్‌ అంటే:

కర్వాచౌత్‌ అంటే:

కర్వాచౌత్‌ అంటే.. దీపావళికి ముందు వచ్చే చవితి నాడు దక్షిణానికి చెందిన మహిళలు కర్వాచౌత్‌ పండుగని ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజు మహిళలు తన భర్త కోసం ఉపవాసం ఉండి .. సాయంత్రం వేళ పూజ నిర్వహిస్తారు. ఆ తర్వాత జల్లెడలో చంద్రుడుని చూసి అదే జల్లెడలో భర్త ముఖాన్ని చూసిన తర్వాత ఉపవాసం విడుస్తారు. ఇలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని మహిళలు విశ్వసిస్తారు. కర్వాచౌత్ వేడుకలు ప్రతి ఏడాది ముంబైతో పాటు పలు ప్రాంతాలలో ఘనంగా జరుగుతున్నాయి.

Story first published: Friday, October 18, 2019, 14:45 [IST]
Other articles published on Oct 18, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+