IPL 2020: బాల్కనీలో పనికానిచ్చేస్తున్న విరాట్ కోహ్లీ (వీడియో)

దుబాయ్: భారత క్రికెట్‌లో ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన ఆటగాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. శారీరక దృఢత్వంపై అతడికి ఎనలేని నమ్మకం. జట్టు సభ్యులంతా రెండు గంటలు కసరత్తులు చేస్తే.. కోహ్లీ నాలుగు గంటలు కష్టపడతాడు. ఎక్కడ ఉన్నా ఎక్కువ సేపు జిమ్‌లో గడుపుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అతడిని చూసి మిగతా భారత క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై దృష్టిసారించిన సంగతి తెలిసిందే. కోహ్లీని చూసి జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మనీష్ పాండే, మొహమ్మద్ షమీ కూడా సిక్స్ పాక్ చేసారు. ఫిట్‌నెస్ కోసం విరాట్ శాకాహారిగా కూడా మారాడు.
బాల్కనీలోనే ఎక్సర్‌సైజ్‌లు:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 మ్యాచులు వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న నేపథ్యంలో గతవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) బృందం దుబాయ్ చేరుకుంది. దుబాయ్ చేరుకున్న ఆర్‌సీబీ ఆటగాళ్లు బీసీసీఐ నిబంధన ప్రకారం హోటల్‌లో ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. దాంతో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి జిమ్ సదుపాయాన్ని వాడుకునే అవకాశం లేకపోయింది. అయినప్పటికీ బాల్కనీలోనే కోహ్లీ తాను రెగ్యులర్‌గా చేసే ఎక్సర్‌సైజ్‌లు చేశాడు. పుష్ అప్స్, డంబెల్స్ సాయంతో చెమటోడ్చాడు.

బాల్కనీ జిమ్‌కు స్వాగతం:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బుధవారం తన అధికారిక ట్విట్టర్‌లో విరాట్ కోహ్లీ బాల్కనీలో ఉండి వర్కౌట్ చేసే వీడియోను అభిమానుల కోసం షేర్ చేసింది. 'కెప్టెన్ విరాట్ కోహ్లీ.. బాల్కనీ జిమ్‌కు స్వాగతం' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు విరాట్ గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత క్రికెట్ జట్టును ఫిట్‌నెస్ పరంగా ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఘనత శంకర్ బసూదే. కోహ్లీ, బుమ్రా వంటి క్రికెటర్లను ఫిట్‌నెస్ పరంగా కూడా టాప్‌లో నిలిపిన వ్యక్తి శంకర్ బసూ.

కప్పు గెలవాలని కసిగా:
ఐపీఎల్‌లో ఇప్పటివరకు కప్ గెలవని ఆర్‌సీబీ.. గతేడాది ఎనిమిదో స్థానానికే పరిమితం అయ్యింది. ఈసారి యూఏఈలో ఎలాగైనా కప్పు గెలవాలని కసిగా ఉంది. ఐపీఎల్ సహచరులతో ఇటీవల జరిగిన వర్చువల్ సమావేశంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందకుండా విధించిన అన్ని మార్గదర్శకాలను పాటించాలని సూచించాడు. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉన్నా.. అది మొత్తం టోర్నమెంట్‌ను పాడుచేయగలదని హెచ్చరించాడు.

రోజుల క్వారంటైన్:
ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడే ఆటగాళ్లందరూ ప్రస్తుతం యూఏఈలో ఆరు రోజుల క్వారంటైన్‌లో ఉన్నారు. ఐపీఎల్ టోర్నీ కోసం అందరికన్నా ముందుగా దుబాయ్‌కు చేరుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రాజస్థాన్ రాయల్స్ జట్ల ఆరు రోజుల క్వారంటైన్ ఈ రోజు ముగిసింది. చెన్నై సూపర్‌కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ గత శుక్రవారం అక్కడికి చేరుకున్నాయి. వారి క్వారంటైన్ గురువారంతో ముగుస్తుంది. అన్ని జట్ల క్వారంటైన్ ముగిసిన తర్వాత అసలు సిసలైన సందడి మొదలవ్వనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
IPL 2020: ముగిసిన క్వారంటైన్.. మైదానంలో ప్రాక్టీస్!!