న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫించ్‌ను మన్క్‌డింగ్ చేద్దానుకున్నా.. కానీ అతడు నాకు మంచి స్నేహితుడు.. బతికిపోయాడు: అశ్విన్‌

IPL 2020: Ricky Ponting also believed that I should have Mankaded Aaron Finch says Ravichandran Ashwin

దుబాయ్:ఐపీఎల్‌ 12వ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ కెప్టెన్ అయిన రవిచంద్రన్‌ అశ్విన్‌ చేసిన 'మన్కడింగ్'‌ చేసిన విషయం తెలిసిందే. మన్కడింగ్‌ ద్వారా రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్‌ను రనౌట్‌ చేశాడు. అశ్విన్ బంతి విసరక ముందే నాన్‌ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బట్లర్.. క్రీజు వెలుపలికి వెళ్లాడు. దీంతో బౌలింగ్‌ ఆపిన అశ్విన్.. నాన్‌స్ట్రక్ ఎండ్‌లోని బెయిల్స్‌ని ఎగరగొట్టాడు.

అప్పుడు అశ్విన్‌‌ తీరుపై కొందరు మండిపడ్డారు. క్రీడాస్ఫూర్తి తప్పాడంటూ విమర్శలు గుప్పించారు. ఇక ఐపీఎల్ 2020 మొదలవగానే.. మన్కడింగ్‌పై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. మన్కడింగ్ చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని కొందరు వ్యతిరేకిస్తుంటే.. నియమాలకు లోబడే ఉందని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు.

ఫించ్‌కు ఝలక్:

ఫించ్‌కు ఝలక్:

గతేడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న రవిచంద్రన్‌ అశ్విన్..‌ ఐపీఎల్ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున స్పిన్నర్‌గా ఆడుతున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్ ఆరోన్ ఫించ్‌కు అశ్విన్ అదిరిపోయే ఝలక్ ఇచ్చాడు. అశ్విన్ బంతి విసరక ముందే ఫించ్.. క్రీజు వదిలి చాలా దూరం వెళ్లిపోయాడు. దాంతో అతడి వైపు కోపంగా చూసిన అశ్విన్.. ఫస్ట్ వార్నింగ్ అనేలా సైగ చేసి ఊరుకున్నాడు. ఆ మ్యాచ్ తర్వాత అశ్విన్ ఓ పోస్ట్ కూడా చేశాడు. 'ఐపీఎల్ 2020లో ఫస్ట్, ఫైనల్ వార్నింగ్ ఇదే. ఆ తర్వాత నన్ను నిందించొద్దు' అని ట్వీట్ చేశాడు.

మన్క్‌డింగ్ చేయాలా వద్దా అని ఆలోచించా:

మన్క్‌డింగ్ చేయాలా వద్దా అని ఆలోచించా:

బెంగళూరు ఓపెనర్ ఆరోన్ ఫించ్‌ను మన్కడింగ్‌ చేసే అవకాశం లభించినా ఎందుకు చేయలేదో ఆర్ అశ్విన్‌ తాజాగా తన యూట్యూబ్‌ ఛానెల్‌లో వివరించాడు. 'నా చూపుతో ఫించ్‌కు ఎలాంటి సందేశం ఇవ్వలేదు. మెసేజ్‌లు ఇచ్చే అంత పెద్ద నాయకుడిని కాదు. బౌలింగ్ చేయడానికి వెళ్తుండగా.. బంగారు హెల్మెట్‌ ముందుకు కదులుతున్నట్లు అనిపించింది (బెంగళూరు ఆటగాళ్ల హెల్మెట్‌ బంగారు రంగులో ఉంటుంది). దీంతో బౌలింగ్ వేయడం ఆపేశాను. మన్కడింగ్ చేయాలా వద్దా అని ఆలోచించాను' అని అశ్విన్‌ తెలిపాడు.

నేను, ఫించ్‌ మంచి స్నేహితులం

నేను, ఫించ్‌ మంచి స్నేహితులం

'నేను మన్కడింగ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు కూడా ఆరోన్ ఫించ్‌ క్రీజులోకి వెళ్లలేదు. నా వైపే చూస్తూ ఉన్నాడు. దాని అర్థం ఏంటో నాకు తెలియదు. అయితే పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించినప్పటి నుంచి నేను, ఫించ్‌ మంచి స్నేహితులం. ఎన్నో సందర్భాల్లో కూర్చొని పలు విషయాలు చర్చించుకున్నాం. ఏదీ ఏమైనా మన్కడింగ్‌ గురించి అదే నా ఫైనల్‌ వార్నింగ్' అని ఆర్ అశ్విన్‌ వెల్లడించాడు. ఫించ్‌, అశ్విన్ ఇదివరకు పంజాబ్‌కు ఆడిన విషయం తెలిసిందే.

 మన్క్‌డింగ్ చేస్తానని రికీ అనుకున్నాడు

మన్క్‌డింగ్ చేస్తానని రికీ అనుకున్నాడు

'ఈ విషయం గురించి ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్‌తో మాట్లాడా. క్రీజు నుంచి ఫించ్‌ చాలా దూరం వెళ్లాడని, అతడ్ని నేను ఔట్‌ చేస్తానని భావించాడని రికీ నాతో అన్నాడు. అయితే ఐసీసీ కమిటీతో రన్‌ పెనాల్టీ గురించి మాట్లాడతానని అతడు అన్నాడు. పెనాల్టీ తీవ్రంగా ఉండాలని నేను భావిస్తున్నా. 10 పరుగుల కోత విధిస్తే ఏ బ్యాట్స్‌మెన్‌ క్రీజు దాటడు. అయితే ఇలా బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌ చేయడం నైపుణ్యం కాదు. కానీ బౌలర్‌కు మరో అవకాశం లేదు. దొంగలు పశ్చాతాపం పడే వరకు దొంగతనాలు ఆపలేరు. ఎప్పటికీ నేను పోలీసుగానూ ఉండలేను' అని అశ్విన్ సూక్తులు చెప్పాడు.

KKR vs CSK: మూడు మ్యాచుల్లో విఫలమైతే ఏం నష్టం లేదు.. అతడు మ్యాచ్ విన్నర్: కోల్‌కతా కెప్టెన్‌

Story first published: Wednesday, October 14, 2020, 13:45 [IST]
Other articles published on Oct 14, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X