Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

KKR vs CSK: మూడు మ్యాచుల్లో విఫలమైతే ఏం నష్టం లేదు.. అతడు మ్యాచ్ విన్నర్: కోల్‌కతా కెప్టెన్‌

IPL 2020, KKR vs CSK: Two-three poor games don’t matter, Dinesh Karthik backs Sunil Narine

అబుదాబి: వరుసగా విఫలమవుతున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ స్పిన్నర్ సునీల్‌ నరైన్‌కు ఆ జట్టు కెప్టెన్ దినేష్ కార్తీక్ అండగా నిలిచాడు. రెండు మూడు మ్యాచుల్లో విఫలమైతే.. అది పెద్ద సమస్య కాదని, నరైన్‌ను కనీసం ప్రోత్సహించాల్సిన బాధ్యత మాపై ఉందన్నాడు. ప్రతీ జట్టులో మ్యాచ్‌ను మలుపు తిప్పే కీలక ఆటగాళ్లు ఉంటారని, నరైన్‌ కూడా అలాంటివాడేనని కోల్‌కతా కెప్టెన్‌ కార్తీక్‌ అన్నాడు. బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా చెన్నై సూపర్‌కింగ్స్‌పై 10 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ అనంతరం దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.... 'రెండు మూడు మ్యాచుల్లో విఫలమైతే ఇదేమంత పెద్ద సమస్య కాదు. సునీల్ నరైన్‌ను కనీసం ప్రోత్సహించాల్సిన బాధ్యత మాపై ఉంది. ప్రతీ జట్టులో మ్యాచ్‌ను మలుపు తిప్పే కీలక ఆటగాళ్లు ఉంటారు, నరైన్‌ కూడా అలాంటివాడే. రాహుల్‌ త్రిపాఠి టాప్‌ ఆర్డర్‌లో రాణించడం సంతోషంగా ఉంది. ఆండ్రీ రసెల్‌ గురించి చెప్పాలంటే.. అతనో బహుముఖ ఆటగాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో రాణిస్తాడు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగలడు. మా బ్యాటింగ్‌ ఆర్డర్‌ నాణ్యమైంది' అని తెలిపాడు.

IPL 2020, KKR vs CSK: Two-three poor games don’t matter, Dinesh Karthik backs Sunil Narine

'నేను మొదట్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేవాడిని. ఇప్పుడు ఏడో స్థానంలో వచ్చాను. ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్‌ మంచి ఆరంభం ఇచ్చారు. చివర్లో బౌలర్లు సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి ప్రత్యర్థిని బంతితో కట్టడి చేశారు. వాళ్లిద్దరిపై నాకు అపారమైన నమ్మకం ఉంది' అని దినేష్ కార్తీక్‌ పేర్కొన్నాడు. కోల్‌కతాకు ఎప్పుడూ ఓపెనర్‌గా బ్యాటింగ్‌ చేసే నరైన్..‌ బుధవారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో నాలుగో స్థానంలో ఆడాడు. తన స్థానంలో రాహుల్‌ త్రిపాఠి బరిలోకి దిగాడు. నరైన్ 9 బంతుల్లో ఓ ఫోర్, సిక్స్ బాది 17 రన్స్ చేశాడు. ఇక 4 ఓవర్లు బౌలింగ్ చేసి 31 పరుగులు ఇచ్చాడు. ఓ వికెట్ కూడా తీశాడు. కీలక సమయంలో 19 ఓవర్ వేసిన నరైన్..‌ 10 పరుగులు ఇచ్చాడు.

టాస్‌ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్‌ ఎంచుకుంది. చెన్నై బౌలర్ల ధాటికి కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌కు క్యూ కట్టారు. రాహుల్‌ త్రిపాఠి (81; 51 బంతుల్లో 8ఫోర్లు, 3సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. దీంతో చెన్నై ముందు 168 పరుగుల గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో చెన్నై బ్యాట్స్‌మెన్‌కు మంచి ఆరంభం లభించింది. 12 ఓవర్లకు ఒక వికెట్‌ కోల్పోయి 99 పరుగులు చేసింది. 8 ఓవర్లలో 69 పరుగులు మాత్రమే కావాల్సిన సమయంలో కోల్‌కతా బౌలర్లు పుంజుకుని రాయుడు, వాట్సన్‌ను పెవిలియన్‌కు చేరారు. ఆపై కూడా కీలక సమయాల్లో వికెట్లు తీసి చెన్నైని దెబ్బకొట్టారు. దీంతో కోల్‌కతా 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా తర్వాతి మ్యాచ్‌ను అక్టోబర్‌ 10న అబుదాబి వేదికగా పంజాబ్‌తో ఆడనుంది.

Story first published: Thursday, October 8, 2020, 14:41 [IST]
Other articles published on Oct 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+