For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs SRH: చావో రేవో మ్యాచ్‌లో మనోళ్లు గెలిచెనా? బెంగళూరుపై రివేంజ్ తీర్చుకునెనా?

IPL 2020, RCB vs SRH: Who will win Royal Challengers Bangalore vs Sunrisers Hyderabad, Predicted Playing XI

షార్జా: ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో గత‌‌‌ మ్యాచ్‌‌‌‌లో బలమైన ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌కు షాకిచ్చిన సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌ తమకు చావోరేవో లాంటి మరో మ్యాచ్‌‌‌‌కు సిద్దమైంది. డబుల్‌‌‌‌ హెడర్‌‌‌‌లో భాగంగా శనివారం రాత్రి షార్జాలో జరిగే మ్యాచ్‌‌‌‌లో రాయల్‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌ బెంగళూరును ఢీ కొట్టనుంది. ప్లే ఆఫ్‌‌‌‌ రేస్‌‌‌‌ నేపథ్యంలో ఇరుజట్లకు ఈ మ్యాచ్‌‌‌‌ కీలకం. లీగ్‌‌‌‌లో ఇప్పటిదాకా 12 మ్యాచ్‌‌‌‌లాడిన సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌10 పాయింట్లు సాధించింది. దీంతో మిగిలిన (బెంగళూరు, ముంబై) రెండు మ్యాచ్‌‌‌‌ల్లో గెలిస్తేనే ప్లే ఆఫ్‌‌‌‌ ఆశలు సజీవంగా ఉంటాయి. పాయింట్లకు తోడు మెరుగైన నెట్‌‌‌‌రన్‌‌‌‌ రేట్‌‌‌‌తోనే సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ ముందడుగు వేయగలదు.

దీంతో ఆరెంజ్‌‌‌‌ ఆర్మీకి భారీ విక్టరీలు కావాలి. అలా కాకుండా ఏ ఒక్కదానిలో ఓడినా సన్‌‌‌‌రైజర్స్‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌13 జర్నీ లీగ్‌‌‌‌ స్టేజ్‌‌‌‌లోనే ముగుస్తుంది. మరోపక్క బెంగళూరుది కాస్త మెరుగైన పరిస్థితి. 12 మ్యాచ్‌‌‌‌లాడి 14 పాయింట్లు సాధించిన బెంగళూరు.. తమకు మిగిలిన రెండు మ్యాచ్‌‌‌‌ల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్స్​ చేరుకుంటుంది. రెండింటిలోనూ ఓడితే మిగిలిన టీమ్స్‌‌‌‌ ఫలితాల‌‌‌పై ఆధారపడాల్సి ఉంటుంది. కాగా.. సీజన్‌‌‌‌ స్టార్టింగ్‌‌‌‌లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌‌‌‌లో బెంగళూరు గెలిచింది. ఓటమి ముంగిట హైదరాబాద్ చేతులెత్తేసింది. మరీ ఈ మ్యాచ్‌లో గెలిచి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు ప్లే ఆఫ్ రేసులో నిలవాలని డేవిడ్ సేన భావిస్తోంది. మరి విజయం ఏ జట్టును వరిస్తుందో చూడాలి.

ఆత్మవిశ్వాసంతో ఆరెంజ్ ఆర్మీ..

ఆత్మవిశ్వాసంతో ఆరెంజ్ ఆర్మీ..

ఇక ఢిల్లీపై సాధించిన విక్టరీతో సన్‌‌‌‌రైజర్స్‌ హైదరాబాద్ ఆత్మవిశ్వాసం‌ అమాంతం‌‌‌ పెరిగింది. కెప్టెన్‌‌‌‌ డేవిడ్ వార్నర్‌‌‌‌, మనీశ్‌‌‌‌ పాండేతోపాటు వృద్ధిమాన్‌‌‌‌ సాహా ఫామ్‌‌‌‌ కొనసాగిస్తే హైదరాబాద్‌‌‌‌కు తిరుగుండదు. అయితే, గాయపడిన సాహాను ఈ మ్యాచ్‌‌‌‌లో ఆడిస్తారో లేదో అనేదానిపై క్లారిటీ లేదు. బౌలర్లు కూడా రాణిస్తే హైదరాబాద్​కు తిరుగుండదు. తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న విజయ్ శంకర్ లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. ఇది సన్‌రైజర్స్‌కు తలనొప్పిగా మారింది. జట్టు కూర్పు గందరగోళంలోకి నెట్టేసింది. అతని స్థానంలో అభిషేక్ శర్మను ఆడించవచ్చు. సాహా దూరమైతే బెయిర్ స్టో రావచ్చు.

నవ్‌దీప్ సైనీ డౌటే..

నవ్‌దీప్ సైనీ డౌటే..

మరోపక్క బెంగళూరు కూడా అన్ని విభాగాల్లో బలంగా ఉంది. కానీ గత రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది. యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌ దేవదత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌ సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండగా కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌లో మూలస్తంభాలు. జోష్‌‌‌‌ ఫిలిప్‌‌‌‌, ఆరోన్‌‌‌‌ ఫించ్‌‌‌‌లో ఎవరిని సెలెక్ట్‌‌‌‌ చేస్తారో చూడాలి. విరాట్, ఏబీడీలు చెలరేగితే హైదరాబాద్‌కు కష్టాలు తప్పవు. ఇక మోరిస్ రాకతో ఆర్‌సీబీ బలం పెరగ్గా.. నవ్‌దీప్ సైనీ గాయంతో మళ్లీ ఒడిదొడుకులు ఎదుర్కొంటుంది. మోరిస్‌‌‌‌, సిరాజ్‌‌‌‌, చహల్‌‌‌‌, సుందర్‌‌‌‌తో బౌలింగ్‌‌‌‌ లైనప్‌‌ బలంగానే ఉంది. మరీ వెబ్బింగ్ గాయంతో బాధపడుతున్న సైనీ.. ఈ మ్యాచ్ బరిలోకి దిగుతాడా? లేక బెంచ్‌కే పరిమితమవుతాడో చూడాలి. అదే జరిగితే ఇసురు ఉడానా తుది జట్టులో ఉండవచ్చు.

పిచ్ రిపోర్టు, ముఖాముఖి..

పిచ్ రిపోర్టు, ముఖాముఖి..

స్పిన్‌కు బాగా అనుకూలించే పిచ్. టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్‌కే మొగ్గు చూపవచ్చు. తొలుత బౌలింగ్ అనుకూలిస్తూ.. తర్వాత బ్యాటింగ్‌కు సులువయ్యే పరిస్థితులుంటాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ చానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.ఒక వర్షంతో రద్దయింది. ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు 16 సార్లు తలపడగా.. 8-7తో హైదరాబాద్ లీడ్‌లో ఉంది. ఇక గత ఐదు మ్యాచ్‌ల్లో బెంగళూరు మూడు గెలవగా.. హైదరాబాద్ 2 గెలిచింది.

తుది జట్లు(అంచనా)

తుది జట్లు(అంచనా)

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: జోష్ ఫిలిప్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్(వికెట్ కీపర్), గుర్‌కీరత్ సింగ్, శివమ్ దూబే/మోయిన్ అలీ, వాషింగ్టన్ సుందర్, క్రిస్ మోరిస్, నవదీప్ సైనీ/ఇసురు ఉడానా, యుజ్వేంద్ర చాహల్, మహ్మద్ సిరాజ్

సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), వృద్దిమాన్ సాహా(కీపర్)/ జానీ బెయిర్‌స్టో(కీపర్), మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమాద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, షెబాజ్ నదీమ్, సందీప్ శర్మ, టీ నటరాజన్

IPL 2020 టైటిల్ ముంబై ఇండియన్స్ గెలవదు.. ఆ జట్లకే అవకాశం: ఎమ్మెస్కే ప్రసాద్

Story first published: Saturday, October 31, 2020, 15:16 [IST]
Other articles published on Oct 31, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+