
హైదరాబాద్: ఐపీఎల్ 2020 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన కనబర్చి ప్లే ఆఫ్స్ చేరిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో 10 వికెట్లతో గెలుపొందిన వార్నర్ సేన సగర్వంగా టోర్నీలో ముందడుగు వేసింది. టైటిల్‌కు మరో మూడు అడుగుల దూరంలో నిలిచింది. ప్లే ఆఫ్స్‌లో భాగంగా శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ ఆటగాళ్లు సేద తీరుతున్నారు. ముంబై ఇండియన్స్‌పై సాధించిన విజయాన్ని తమదైన శైలిలో ఆస్వాదించిన ఆరెంజ్ ఆర్మీ.. బెంగళూరు మ్యాచ్‌కు ముందు కూడా సరదా గేమ్‌లు ఆడుతూ ఆస్వాదిస్తుంది. ఈ క్రమంలోనే కెప్టెన్ డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ డార్ట్ గేమ్ ఆడారు. ఇద్దరూ చిన్న యారోస్‌తో డార్ట్ బోర్డ్‌కు గురి పెట్టి విసిరారు. తొలుత వార్నర్ ముందంజలో ఉండగా.. కూల్‌గా ఆడిన విలియమ్సన్.. డార్ట్ బోర్డ్‌పై ఫోకస్ పెట్టి 8-8తో వార్నర్‌ను సమం చేశాడు.
తర్వాతి యారోను గురి చూసి సరిగ్గా మధ్యలోకి విసరిన విలియమ్సన్ విజేతగా నిలిచాడు. విలియమ్సన్, వార్నర్ ఇద్దరూ ఒకరినొకరు పోత్సహించుకుంటూ సరదాగా ఈ డార్ట్ గేమ్ ఆడారు. అయితే బెంగళూరుతో జరిగిన ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌కు ముందు కూడా ఈ ఇద్దరూ డార్ట్ గేమే ఆడటం విశేషం.
ఈ వీడియోను సన్‌రైజర్స్ హైదరాబాద్ 'కేన్ vs డేవిడ్'మధ్య క్యాంప్ సరదా గేమ్ అంటూ ట్వీట్ చేయగా.. నెట్టింట వైరల్ అయింది. అయితే అభిమానులు మాత్రం.. ప్రాక్టీస్ చేయండి మావా.. టైటిల్ గెలిచాక తీరిగ్గా ఇలాంటి ఆటలు ఆడుకుందాం'అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇంకొందరేమో.. సీరియస్‌గా ప్రాక్టీస్ చేస్తూ.. ఇలాంటి పాత వీడియోలను షేర్ చేసి, ఆర్‌సీబీని దెబ్బతీయాలని సలహా ఇస్తున్నారు. తదుపరి మ్యాచ్‌లో కేన్ మామ చెలరేగాలని కోరుకుంటున్నారు.
ఇక ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌కు ముందు 'కేన్ కేఫ్'కు వెళ్లిన వార్నర్, బెయిర్‌స్టోలకు విలియమ్సన్ చక్కటి ఆస్ట్రేలియా కాఫీ కలిపి ఇచ్చిన సంగతి తెలిసిందే.